YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన కన్నా మౌనదీక్ష 

ముగిసిన కన్నా మౌనదీక్ష 

ముగిసిన కన్నా మౌనదీక్ష 
అమరావతి డిసెంబర్ 27 
రాజధాని కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేపట్టిన మౌన దీక్ష ముగిసింది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో శుక్రవారం ఆయన మౌన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కన్నా మౌన దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. గంట పాటు ఈ మౌన దీక్ష కొనసాగింది. అనంతరం కన్నా మాట్లాడుతూ.. ‘‘అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తారని ప్రజలు ఊహించలేదు. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారు. అమరావతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పించిందని... కానీ, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసం రాజధానిని వాడుకుంది. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతం మొత్తాన్ని అమ్మేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు రాష్ట్రం తన జాగీరులా జగన్ వ్యవహరిస్తున్నారు. రాక్షసపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్ ప్రకటన చేశారు. కేబినెట్ నిర్ణయం రాకముందే విశాఖలో వైసీపీ ఎంపీ పండగ చేసుకున్నారు. జగన్ అధికారంలోకి రాగానే రాజధానిపై కుట్రలకు బీజం వేశారు. ఇదంతా కుట్ర అనే విషయం అర్థమవుతుందని అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను ఎప్పుడూ స్వాగతించలేదు. రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం. పాలనా వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం.. అభివృద్ధి వికేంద్రీకరణకు కాదు. నేను తెలుగులో మాట్లాడింది.. వైసీపీ నేతలకు అర్థం కాలేదేమో? వాళ్లు బ్రిటీష్ వారసులు.. మేం తెలుగు వారసులు. ఇలాంటి నియంతృత్వాన్ని, అహంకార ధోరణిని బీజేపీ ఖండిస్తోందని అన్నారు.

Related Posts