వివాహితను తగులబెట్టి... ఆ పై ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ డిసెంబర్ 27
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని వివాహిత అంజిలమ్మ(40)ను నియలాల మండలం అగ్గనూరు గ్రామ వాసి నర్సింహులు (45) గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమే నిరాకరించడంతో గురువారం రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. తరువాత నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. మంటలార్పేందుకు వెళ్లిన అంజిలమ్మ తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.