YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పౌరసత్వ బిల్లును వ్యతిరేకించాలి

పౌరసత్వ బిల్లును వ్యతిరేకించాలి

పౌరసత్వ బిల్లును వ్యతిరేకించాలి
జగిత్యాల డిశంబర్ 27
పార్లమెంట్ లో ఆమోదం పోందిన బిల్లును వ్యతిరేకించాలని కోరుట్ల అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘ నాయకులు పిలుపునిచ్చారు.కోరుట్ల పట్టణంలోని కింగ్ గార్డెన్ లో గురువారం అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మౌలానా మజార్ ఖాస్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 70 సంవత్సరాల ఈ దేశంలో సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉందని, మోదీ సర్కార్ సీఏఏ ,ఎన్ ఆర్ సీ బిల్లులతో రాజ్యాంగ సవరణ చట్టాలు తెచ్చి భారత దేశ ప్రజలకు ఆశాంతి కల్గిస్తుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వం ఈ దేశ ప్రజలకు రక్షణగా ఉందని , పార్లమెంటులో తిరిగి పౌరసత్వాన్ని సవరణ చేయడం ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుందన్నారు. ఐక్యంగా హిందూ ముస్లింలు కలిసి బిల్లులను వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకోవాలన్నారు. పౌరసత్వ బిల్లు తీసుకురావడం ముస్లింలతోపాటు హిందువులకు కూడా అభద్రతా భావం కలిగిస్తుందని ఈ దేశ పౌరులు మెజారిటీ హిందువులకు నష్టం ఆని తెలిపారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించి మనకు అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. మైనార్టీ ,దళితులకు రక్షణ కరువైందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం పోందిన సీఏఏ ,ఎన్ ఆర్ సీ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం ఉందన్నారు. హిందువులకు, దళితులకు బిల్లు సవరణతో నష్టం దయాకంగా ఉందన్నారు. కాబట్టి మైనారిటీ, దళితులు ,హిందువులు సీఏఏ ,ఎన్ ఆర్ సీ బిల్లులు ఉపసంహరించే వరకు కలసి కట్టుగా ఉద్యోమం చేయాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ,సీపీఐ, సీపీఐఎం ,ఎంఆర్పీఎస్, మైనారిటీ నాయకులు, తిరుమల గంగాధర్, చెన్న విశ్వనాథం,  చింత భూమేశ్వర్,చెట్ పెల్లి లక్ష్మణ్, వ్యాపారవేత్త నాయిం , ఇలియాస్ ఖాన్ ,సలీం ఫారుఖీ ,చాంద్ పాషా, న్యాయవాదులు వోటారికారి శ్రీనివాస్, ముబీన్ పాష ,తదితరులు పాల్గొన్నారు
 

Related Posts