YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మునిసిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు పై సుప్రీంకోర్టు లో సవాల్   14బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం

మునిసిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు పై సుప్రీంకోర్టు లో సవాల్   14బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం

మునిసిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు పై సుప్రీంకోర్టు లో సవాల్
          14బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్ డిసెంబర్ 27 
వచ్చే మునిసిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 26 శాతం తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని 14 బీసీ సంఘాల సమావేశం హెచ్చరించింది. ఈరోజు బిసి భవన్ లో ముఖ్యమైన బీసీ నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. మునిసిపల్ ఎన్నికలలో బిసి రిజర్వేషన్లు తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టాలని  బీసీ సంఘాలు నిర్ణయించాయి. అలాగే సుప్రీంకోర్టు లో సవాల్ చేయాలని నిర్ణయించారు సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి, రాష్ట్ర బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండేటి శంకర్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు నరసింహ గౌడ్, రాష్ట్ర బి.సి సేన అద్యక్షులు బర్క కృష్ణ, రాష్ట్ర బి.సి ప్రజా సమితి అద్యక్షులు మధుసూదన్, రాష్ట్ర బి.సి ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఉపేందర్ గౌడ్.పాల్గొని ప్రసంగించారు. ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్లను తగ్గించాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 34 శాతం, మహారాష్ట్రలో 39 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో లేని అవరోధాలు మన రాష్ట్రంలో ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. పైగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 50 శాతం సీలింగ్ కేసు 2010లో తీర్పు వచ్చింది. ఆ తరువాత జరిగిన 2013 మున్సిపల్ ఎన్నికలలో, 2014 పంచాయతీరాజ్ ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. జనాభా లెక్కలు సమగ్రంగా ఉంటే రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెంచుకోవచ్చునని అదే 2010లో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు చెప్పింది. 2014 రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో బీసీ కులాల జనాభా 52 శాతం అని శాస్త్రీయంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది. అదే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మునిసిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు ను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలి. కానీ తగ్గించడమేమిటని అని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయంగా బీసీ నాయకత్వాన్ని పెరగకుండా దెబ్బతీసే కుట్ర అని అన్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే టి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ వ్యతిరేకిస్తూ స్పందించాలని కోరారు.
 అనంతరం బిసి ఐఖ్యవేదిక అద్యక్షులు ఆలం లల్లి రామ్ కోటి మాట్లాడుతూబీసీ సంఘాలు చేసే ఉద్యమాలకు ప్రతిపక్షాలు మద్దతుగా కలిసిరావాలని కోరారు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని పంచాయతీ నుండి నేటి మున్సిపల్ ఎన్నికల వరకు వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా ముందుకు వెళుతుంది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో గాని, ఇతర రాష్ట్రాలలో గాని ముందు రిజర్వేషన్ల స్థానాలను ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించి, సర్దుబాటు చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ/బిసి మరియు మహిళా రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల నోటిఫికేషన్  జారీ చేయడంలోనే బీసీ వ్యతిరేక కుట్ర ఉందన్నారు.టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన పెంచడం దేవుడెరుగు..! తగ్గించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అనేక బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. గ్రామపంచాయతీ-ఎంపీటీసీ-జడ్పిటిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించారు. బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ 5660 కోట్ల నుండి 2990 కోట్ల కు తగ్గించారు. గత మూడు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్, యం.బీ.సీ కార్పొరేషన్ కు, 12 బీసీ కుల ఫెడరేషన్లకు ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించకుండా ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేయడం లేదు. అలాగే బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై  క్రిమిలేయర్ నిబంధన విధించి అన్యాయం చేస్తున్నారు. కాలేజీ కోర్సులు చదివే మైనారిటీలకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ, బిసి విద్యార్థులకు మంజూరు చేయడం లేదు. పెరుగుతున్న జనాభా ప్రకారం కొత్త హాస్టల్ ప్రారంభించాలి, కానీ అందుకు విరుద్ధంగా 69 హాస్టల్లో మూసివేశారు. కలెక్టరేట్లకు, సచివాలయంలోకి అసెంబ్లీ కూలగొట్టి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. కానీ గత ఆరు సంవత్సరాలు ఒక హాస్టల్ భవనం గాని, గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మించలేదు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు హాస్టల్ విద్యార్థులకు బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు.బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సంఘాలు నిర్ణయించాయి .

Related Posts