YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రోజుకో మాట

 రోజుకో మాట

 రోజుకో మాట
అమరావతి డిసెంబర్27
అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు. తలోమాట మాట్లాడి రాజధాని ని నాశనం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ కుట్రలు గమనించాలని 5కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి ఎప్పటికీ ప్రజా రాజాధానే. రాజధాని కి లక్ష కోట్లు కావాలి అంటున్న మంత్రులకు సంపద సృష్టిపై అవగాహన లేదా. కనీస మౌలిక సూత్రాలు కూడా తెలియని విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. భూ సమీకరణ వినూత్న ఆలోచన. సచివాలయం, కోర్టు ఇక్కడ నడుస్తుండగా పరిపాలన కు కొత్తగా  డబ్బులెందుకు. నిధులు లేవు అని చెప్పటం ఒక సాకు మాత్రమే. ఇప్పుడు తరలింపు కోసం అదనంగా డబ్బు ఖర్చుపెట్టాలి కానీ ఉన్న వాటిని వినియోగించుకోటానికి  ఇబ్బందేంటని అయన ప్రశ్నించారు. కావాలనే పదే పదే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకూ ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు. కాదు 75శాతం వెనుకబడినవారున్నారని నిరూపిస్తే వెనక్కి తగ్గారు. తర్వాత ముంపు ప్రాంతమని మాట్లాడారు. అందుకనుగుణంగానే ముంచటానికి అనేక కుట్రలు పన్నారు. అదీ సాధ్యపడలేదు. అందుకే ఇప్పుడు డబ్బులు లేవని కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు.

Related Posts