YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పన్నులు పట్టవా..? (పశ్చిమగోదావరి)

పన్నులు పట్టవా..? (పశ్చిమగోదావరి)

పన్నులు పట్టవా..? (పశ్చిమగోదావరి)
ఏలూరు, డిసెంబర్ 27 జిల్లాలోని పట్టణాల్లో ప్రజల మౌలిక వసతులతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులను పురపాలక సంఘాలు వెచ్చిస్తుంటాయి. ఏటా ఇళ్లు, కుళాయి, ఖాళీ స్థలాలు, ప్రకటనల పన్నుల ద్వారా రూ. కోట్లలో ఆదాయం సమకూరుతుంది. వివిధ కారణాలతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వసూళ్లలో పురపాలక సంఘాలు వెనుకబడ్డాయి. ఆస్తి పన్నుల విషయానికొస్తే జిల్లాలో రూ. 74.85 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 56.16 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ. 30.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.కుళాయి పన్నులకు సంబంధించి రూ. 26.40 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 19.80 కోట్లకు గాను రూ. 6.22 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఖాళీస్థలాల పన్ను రూ. 8.35 కోట్లకుగాను రూ. 2.53 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఇళ్ల పన్ను వసూళ్లలో కొవ్వూరు ప్రథమంగా నిలవగా భీమవరం, నరసాపురం, తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు బాగా వెనుకబడ్డాయి. కుళాయి పన్ను వసూళ్లలో మాత్రం భీమవరం, పాలకొల్లు పురపాలక సంఘాలు ముందంజలో ఉండగా ఏలూరు, జంగారెడ్డిగూడెం వెనుకబడ్డాయి. ఇతర పన్నుల్లోనూ ఆశించిన స్థాయికి చేరుకోలేక పోయాయి. ఆస్తి, కుళాయి పన్నులతో పాటు ఖాళీస్థలాలు, ప్రకటనలు, డీఅండ్‌ఓ ట్రేడ్‌ ఫీజు వంటి వసూళ్లపై అన్ని పురపాలక సంఘాలు దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికార యంత్రాంగం అడుగులేస్తోంది. ఇప్పటి వరకు వసూళ్లను రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగులే చేసేవారు. ఇక నుంచి నూతనంగా ఏర్పడిన సచివాలయాల పరిపాలన కార్యదర్శులకు అప్పగించారు. దీంతో వార్డుల వారీగా సచివాలయాల కార్యదర్శులే అన్ని రకాల పన్ను వసూలు చేస్తారు. ఇప్పటికే పురపాలక శాఖ ఆర్డీ నాగరాజు పురపాలక సంఘాల వారీగా రెవెన్యూ ఉద్యోగులతో పాటు సచివాలయ పరిపాలన కార్యదర్శులతో సమావేశాలను నిర్వహిస్తూ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుత పన్నుదారులతో పాటు బకాయిదారులకు తాఖీదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికీ చెల్లించకపోతే చర్యలు తీసుకునేలా దృష్టి సారించారు. అందుకు ముందుగా ఇళ్లకు సంబంధించిన కుళాయి కనెక్షన్లను తొలగిస్తారు. ఆ తరువాత జప్తులు నిర్వహించనున్నారు.

Related Posts