YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సౌర శక్తికి ‘రైట్ రైట్’ (కర్నూలు)

సౌర శక్తికి ‘రైట్ రైట్’ (కర్నూలు)

సౌర శక్తికి ‘రైట్ రైట్’ (కర్నూలు)
కర్నూలు, డిసెంబర్ 27  ష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా నంద్యాలతో సహ రాష్ట్రంలో నాలుగు ఆర్టీసీ డిపోల్లో ప్రతిష్టాత్మకంగా సౌర విద్యుత్తును ఏర్పాటు చేసింది. దాంతో ఆర్టీసీ నెలకు చెల్లించే విద్యుత్తు బిల్లులను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నాలుగు చోట్ల విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యుత్తు బిల్లుల ఆదా రూపంలో సంస్థ నష్టాన్ని సగానికిపైగా తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.  నవంబరు 28 నుంచి రాష్ట్రంలో నంద్యాల, చిత్తూరు, మదనపల్లి, కాకినాడ డిపోల్లో సుమారు రూ.కోటితో సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేశారు. అయితే అందులో 75 శాతం ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. ఆర్టీసీవారు సుమారు రూ.35 లక్షలు మాత్రమే చెల్లించారు. దాంతో నెలకు రూ.లక్ష ఆదాయం వచ్చే విధంగా ఆర్టీసీవారు చర్యలు తీసుకుంటున్నారు. వాతావరణాన్ని బట్టి నంద్యాల డిపోను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కొంత మేర ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్తును నేరుగా విద్యుత్తు శాఖవారికి అనుసంధానం చేశారు.  గతంలో నంద్యాల ఆర్టీసీ డిపోలో నెలకు 25 వేల యూనిట్లు విద్యుత్తును వినియోగించి రూ.2 లక్షలు బిల్లులు చెల్లించేవారు. సౌర విద్యుత్తు ద్వారా రోజుకు 400 యూనిట్లు చొప్పున నెలకు 12 వేల యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే వాతావరణాన్ని బట్టి 12 వేలకంటే ఎక్కువ కూడా కావొచ్చు. దాంతో సగానికిపైగా విద్యుత్తు బిల్లును తగ్గించారు. మిగతా యూనిట్లకు ఆర్టీసీవారు విద్యుత్తు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.  రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు కేంద్రాలను ఆ సంస్థ వారే ఐదేళ్ల నిర్వహణ చూసుకునేట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి రోజూ ఉత్పత్తయ్యే విద్యుత్తు ఉప కేంద్రానికి వెళ్తుంది. అయితే వారు నెలకు విద్యుత్తును వినియోగించుకునేదాన్ని బట్టి మిగిలిన మొత్తానికి బిల్లు చెలించే విధంగా ఏర్పాటు చేశారు. వాతావరణాన్ని ఎండను బట్టి సౌర విద్యుత్‌ పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజూ గరిష్ఠంగా 600 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. దీంతో ఏటా నంద్యాల డిపోకు రూ.12 లక్షల మేర ఆదాయం సమకూరనుంది. ఇలా ప్రతి విభాగంలో ఆర్టీసీవారు ఆదాయానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. 

Related Posts