YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిందు సేద్యం... అందని దైన్యం 

బిందు సేద్యం... అందని దైన్యం 

బిందు సేద్యం... అందని దైన్యం 
ఖమ్మం, డిసెంబర్ 27  ఉద్యాన పంటలు సాగు చేసేందుకు కర్షకులు బిందు, తుంపర్ల సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసి ఏడాదవుతున్నా నేటికీ మంజూరు కాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఆయిల్‌పాం, అరటి, కొబ్బరి, కోకో, ఇతర ఉద్యాన పంటలకు బిందు సేద్యం పరికరాలే ప్రధాన నీటి ఆదరువుగా ఉన్నాయి. ఆయిల్‌పాంకు బిందు సేద్యం పరికరాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయిల్‌పాం సాగు చేస్తున్నారంటే బిందు సేద్యం పరికరాలున్నట్లే అన్నంతగా కలిసిపోయాయి. అలాంటిది ఏడాదిగా ప్రభుత్వం వీటికి మంజూరు ఇవ్వలేదు. గత ఏడాది ఇచ్చిన అనుమతులు తప్ప ఈ ఏడాది కొత్తగా ఒక్క దరఖాస్తుకూ మంజూరు ఇవ్వలేదు. ఆన్‌లైన్‌ ప్రక్రియ కూడా జూలై ఒకటో తేదీతో నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కేవలం 33 మీటర్ల దూరం ఉన్న ఉద్యాన పంటలకు మాత్రమే బిందు, తుంపర్ల సేద్యం పరికరాల మంజూరు చేయాలని, అదికూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సగానికి సగం దరఖాస్తులు కూడా మంజూరుకు నోచుకోలేదు. పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీపై బిందు, తుంపర్ల పరికరాలు ప్రభుత్వం అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం రాయితీ, బీసీ, ఓసీలకు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి 90 శాతం రాయితీపై వీటిని అందిస్తుంది. అయిదు ఎకరాల కంటేపైగా 10 ఎకరాల్లోపు ఉన్న బీసీ, ఓసీ రైతులకు 80 శాతం రాయితీపై ఈ పరికరాలను ప్రభుత్వం అందించనుంది. 10 ఎకరాల కంటేపైగా ఉన్న రైతులకు 60 శాతం రాయితీ ఇవ్వగా 40 శాతాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడాదిగా బిందు సైద్యం రాయితీ కోసం దాదాపు ఆరు వేల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి రాయితీ మంజూరులో జాప్యం నెలకొంటోంది. ఈ పథకాలకు రైతులు తొలుత తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. అయితే ఈ ఆన్‌లైన్‌ పద్ధతిని ఆరు నెలలుగా నిలిపేయడంతో కర్షకుల్లో మరింత ఆందోళన పెరిగింది. 2019-20లో రైతులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అది కూడా 33 మీటర్ల దూరం ఉన్న ఉద్యాన తోటలకు మాత్రమే బిందు సేద్యం పరికరాలు మంజూరు చేశారు. దీంతో వేలాది మంది రైతులకు నిరీక్షణే మిగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 398 మంది రైతులు 2 వేల ఎకరాలకు బిందు సేద్యం పరికరాలు మంజూరయ్యాయి. ఖమ్మం జిల్లాలో కేవలం 350 ఎకరాలు 112 మంది రైతులకు మాత్రమే మంజూరు చేశారు. జిల్లా ఉద్యానశాఖ బిందు, తుంపర్ల సేద్యం విభాగం అధికారులతో క్షేత్రస్థాయి సమగ్ర సర్వే చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది రైతులు మిరప, మొక్కజొన్న, కూరగాయలు, అరటి, ఇతర పంటల రైతులకు ఎదురుచూపులే మిగిలాయి

Related Posts