Highlights
- శ్రీ జగదానందకారకం!!
- సకలానందదాయకం!!
- శ్రీరామజనన విశేషాలు
చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర యుక్త గురువారం నాడు మధ్యాహ్నం 12-00 లకు సూర్యుడు నడి నెత్తి పైన వుండే అభిజిత్ ముహూర్తంలో కర్కాటకలగ్నంలోగురుడు చంద్రునితో కలసి ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో వుండంగా కౌసల్యా దశరథ పుణ్య దంపతు లకు అయెాధ్య నగరంలో లోక కళ్యాణం కోసం శ్రీ రామచంద్ర భగవానుని జననం జరిగింది !!
పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు కైకేయికి, ఆశ్లేష నక్షత్రంలో కర్కాట లగ్నంలో సుమిత్రా దేవికి లక్ష్మణ ,శత్రుజ్ఞులు కవలలు గా జన్మించారు !!
లేక లేక యజ్ఞ ప్రసాదంగా దైవ కృపచే జన్మించిన నలుగురు పుత్రులను చూసి దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర లు ఎంతో సంతోషంగా వున్నారు !!
అయోధ్య పురి వాసులుఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు! తన వంశంలో ఆ పరమాత్మ పర బ్రహ్మ తత్వమైన శ్రీమన్నారాయణడు ఆవిర్భవించాడని సంతోషంతో సూర్యుడు అస్తమించనే లేదట !!
అయెాధ్య ప్రజలకు నెలరోజుల వరకు చీకటి అంటే తెలియదని సంత్ తులసి దాసు తన 'రామ చరిత మానసం' లో తెలియ జేసాడు !! ఈ విధంగా దేవతలు, దేవగణములు, పితృగణములు ముల్లోకము లోని వారందరూ సంతోషంగా వున్నారు !! కానీ ఒకరు చాలా దుఃఖంతో వున్నారట ఎవరు వారు ?? ఇంకెవరు చంద్రుడు ! శ్రీ రాముడు పుట్టిన వెంటనే మొట్టమొదట దర్శనమిచ్చింది సూర్యభగవానునకు కదా !!
ఆ ఆనందములో ఆయన అస్తమించటం మరిచాడు కదా !!సూర్యుడు అస్తమిస్తేనే కదా ! చంద్రుడు వచ్చేది !!
లోకానికి చంద్ర దర్ళనం లేదు !! చంద్రునికి రామ దర్శనం లేదు !! ఇది గమనించిన బాల రాముడు ఆకాశంలో చంద్రునికి ప్రత్యేక దర్శనమొసగి ఊరడించాడట !! తన పేరు పక్కన చంద్రుని పేరు పెట్టుకుని ' రామచంద్రుడు 'గా ప్రసిద్ధి పొందుతాను అని వరాన్నిచ్చాడట!!
అంతేకాదు రాబోయే శ్రీ కృష్ణ అవతారంలో అర్ధరాత్రి చంద్రుడు నడి నత్తి పై వుండే సమయంలో జన్మించి చంద్రుని సంతోషింప జేసాడు !!
శ్రీ రామచంద్ర భగవానుడు ఎంత దయాళుడో కదా !!
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం !
లోకాభిరామం శ్రీరామం భూయెాభూయెానమామ్యహం !!
ఆపదల నుండి రక్షించి సర్వ సంపదలను సర్వ సుఖములను ప్రసాదించే లోకాభి రాముడైన శ్రీరామ
చంద్ర భగవానుని నేను సర్వ కాలముల సర్వావస్థల యందు ఎల్లప్పుడు నమస్కరిస్తూ వుంటాను.
జై శ్రీరామ్!! జై జై శ్రీరామ్ !!