YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 బాయ్ ఫ్రెండ్ తో షికారు.. కిడ్నాప్ డ్రామా

 బాయ్ ఫ్రెండ్ తో షికారు.. కిడ్నాప్ డ్రామా

 బాయ్ ఫ్రెండ్ తో షికారు.. కిడ్నాప్ డ్రామా
నాగపూర్, డిసెంబర్ 27, 
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి షికారుకెళ్లిన ఓ యవతి (21).. ఇంట్లో ఈ విషయాన్ని దాచేందుకు కిడ్నాప్‌ డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ రెండో సంవత్సరం చదివే తమ కుమార్తె కళాశాలకు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని యువతి తల్లిదండ్రులు గత సోమవారం నాగ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను వారు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని పేర్కొంది. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని తమ కుమార్తె సురక్షితంగా బయటపడిందని చెప్పుకొచ్చారు.యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. కిడ్నాపర్లు ఎక్కడికి తీసుకెళ్లారో యువతిని అడిగిన పోలీసులు ఆ ఘటనా స్థలానికి ఆమెను తీసుకొని వెళ్లారు. కేసు దర్యాప్తులో భాగంగా నాగ్‌పూర్‌ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని యువతిని విచారించారు. అయితే యువతి చెప్పిన సమాధానాలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.ఇందులో పోలీసులకు దిమ్మతిరిగే విషయం బయటపడింది. ఆ రోజు తరగతులు పూర్తయిన తర్వాత యువతి ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో యువతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తాను కట్టుకథ చెప్పినట్లు అంగీకరించిందని వివరించారు.తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువతి నాగ్‌పూర్‌ నగర శివారుకు వెళ్లిందని.. తర్వాత అతడే ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తాను బయటకు వెళ్లినట్లు తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి యువతి ఈ కిడ్నాప్‌ నాటకమాడిందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేశారని చెబితే తల్లిదండ్రులు భయపడి ఊరుకుంటారని యువతి భావించిందనీ, అయితే వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం డ్రామా బయటపడిందని వివరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.

Related Posts