YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

కాలేజీల్లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ కసరత్తు

కాలేజీల్లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ కసరత్తు

కాలేజీల్లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ కసరత్తు
హైద్రాబాద్, డిసెంబర్ 28,
విద్యార్థినులపై వేధింపులకు ఆదిలోనే అడ్డు కట్ట వేసేందుకు విమెన్ ప్రొటెక్షన్ సెల్ కసరత్తు ప్రారంభించింది. పలు సందర్భాల్లో బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయలేకపోతున్నారని గుర్తించి కాలేజీల్లోనే షీటీమ్స్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. గర్ల్ స్టూడెంట్స్‌తో టీమ్స్ స్టార్ట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్‌కు అటాచ్ చేయడం ద్వారా తోటి విద్యార్థినులకు మెరుగైన రక్షణ కల్పించనుంది. విద్యా సంస్థలతోపాటు కాలేజీకి వెళ్లే దారిలోనూ పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టనుంది. జనవరి నుంచి స్టూడెంట్స్ షీటీమ్స్ సేవలనుఅందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.రెండ్రోజుల క్రితం మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ల్యాబ్ లో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం చేశాడు. అతడు రెండు నెలలుగా ఆ అమ్మాయిని వేధిస్తు న్నట్లు సీసీ కెమెరా పుటేజీల్లో పోలీసులు గుర్తిం చారు. కాలేజీల్లోనే షీటీమ్స్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడే చాన్స్ ఉంది.కాలేజీల్లో స్టూడెంట్స్‌తోనే షీ టీమ్స్‌ని ఏర్పాటు చేసేందుకు విమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్లానింగ్ చేస్తోంది. గ్రేటర్‍ పరిధిలో మహిళలు, యువతులు, విద్యార్థినిలపై వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ కృషి చేస్తున్నా..వారికి కంప్లయింట్లు ఇచ్చేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. దీంతో అనేక కేసులు వెలుగులోకి రాకుండానే మరుగున పడుతున్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రారంభంలోనే అడ్డకట్ట వేసేందుకు కాలేజీ విద్యార్థినుల కోసం షీ టీమ్ మెంబర్లు ఎన్నో అవేర్‌నెస్ ప్రొగ్రామ్స్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నా రు. స్కూల్‍ లెవెల్లో ఇప్పటికే టీచర్లు, స్టూడెంట్స్‌తో కలిపి ‘భద్రత కమిటీ’లు సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. ఈ స్ఫూర్తితో భద్రత కమిటీ లాంటి మరో వినూత్న ప్రొగ్రామ్‌ని ఇంటర్‍, డిగ్రీ, ప్రొఫెషన్ కోర్సులున్న కాలేజీల్లోనూ అమలు చేసేందుకు షీటీమ్, పోలీస్‍ శాఖ సిద్ధమవుతోంది. విద్యార్థినులపై కాలేజీల్లో, బయటి ప్రదేశాల్లో వేధింపులు జరిగితే వాటిని ప్రారంభ దశలోనే అడ్డుకునేందుకు రాష్ట్ర విమెన్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ ప్లానింగ్ రూపొందిస్తోంది. కాలేజీల్లో యాక్టివ్‌గా ఉండే స్టూడెంట్స్, విద్యార్థినులతో కలివిడిగా ఉండే టీచర్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కాలేజీలకు లెటర్స్ పంపుతున్నారు. ఇంటర్‍, డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థినులకు భద్రతకు తోడ్పడే బృందాలను న్యూ ఇయర్‍ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లా పరిధిలో గవర్నమెంట్, ప్రైవేటు ఇంటర్‍ కాలేజీలు 309 వరకు ఉంటాయి. వీటిల్లో సుమారు లక్షా60 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‍, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు కలిపి సుమారు 360 వరకు ఉంటాయి. వీటిల్లో సుమారు 52 వేల మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. ఆయా సంస్థల్లో సుమారు 95 వేల మంది వరకు అమ్మాయిలు చదువుకుంటున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‍ కాలేజీలు నగర శివారుల్లో ఎక్కువగా ఉన్నాయి. కాలేజీలకు వచ్చి పోయే క్రమంలో విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తున్నట్టు కొందరు షీ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. కాలేజీల్లో, బయట ఈవ్ టీజింగ్ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంటడంతో పరిస్థితిలో కొంత వరకు మార్పులు కనిపిస్తున్నట్టు పేర్కొంటున్నా రు. కానీ ప్రతిసారి విద్యార్థినిలు కాలేజీలకు వెళ్లి వచ్చే రూట్లలో నిఘా పెట్టాలంటే కుదరడం లేదని పోలీసులు చెబుతున్నారు. పైగా అందరూ స్టూడెంట్స్ కావడంతో వారు తమ పరిస్థితిని ధైర్యంగా షీ టీమ్ మెంబర్లకు, పోలీసులకు సహకరించడం లేదంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మహిళా భద్రత పోలీసు టీమ్ ఆయా కాలేజీల్లోని స్టూడెంట్స్‌తోనే షీటీమ్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కాలేజీలో ఏర్పాటు చేసే షీ టీమ్స్ ఎల్లప్పుడూ డ్యూటీలో ఉంటాయి. ఆయా కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ పై వారికి అవగాహన ఉంటుంది. పైగా అమ్మాయిలతోనే టీమ్స్ ఏర్పాటు చేస్తే బాధిత విద్యార్థినిలు తమ సమస్యలను నేరుగా వారితో పంచుకునే అవకాశం ఉంటుందని షీ టీమ్ పోలీసులు భావిస్తున్నారు. ప్రతి క్లాస్ నుంచి ఓ అమ్మాయి మెంబర్‌గా ఉండే విధంగా షీ టీమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. కాలేజీల్లోని ప్రతి క్లాస్‍ పరిధిలో చదివే అమ్మాయిలకు భద్రత పరంగా భరోసా కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. భద్రతపై భరోసా కాలేజీ పరిధిలో చదువుకునే స్టూడెంట్స్‌తోనే షీ టీమ్స్‌ని ఏర్పాటు చేస్తే విద్యార్థినులకు ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆకతాయిలు, పోకిరీల వేధింపులకు గురవుతున్న బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. తమతో పాటు చదువుకునే విద్యార్థినులే అనుసంధానంగా ఉన్నట్లయితే వారికి బాధితులు సులభంగా సమస్యను చెప్పుకోగలుగుతారు. దీంతో పోలీసులు ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. బాధితులకు తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థినుల్లో భద్రతపై భరోసా కలుగుతుంది.ఇటీవల జరిగిన కొన్ని ఘటనల కారణంగా అమ్మాయిలను పేరెంట్స్ అత్యవసరమైనే తప్ప బయటకు పంపడం లేదు. ఇక కాలేజీలకు పోయే అమ్మాయిల భద్రతపై పేరెంట్స్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దిశ ఘటన తర్వాత చాలా మంది పేరెంట్స్ స్వయంగా తమ కూతుర్లని కాలేజీల వద్ద వదిలిపెట్టడం పెరిగినట్లు ఓ డిగ్రీ కాలేజీ సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. కానీ కాలేజీలో పోకిరీలు, ఆకతాయిల కారణంగా వేధింపులకు గురయ్యే అమ్మాయిలు ధైర్యంగా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇలా వేధింపులకు గురైన కొందరు గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు సిటీలో ఎన్నో జరిగాయి. ఇలాంటి విషయాలను ఫ్యాకల్టీకి, కాలేజీ మేనేజ్‌మెంట్‌కు చెప్పుకున్నప్పటికీ..వేధింపులకు పాల్పడ్డ వారిని వార్నింగ్‍ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వేధింపులు తీవ్రమవుతున్నా చాలా మంది పేరెంట్స్ దృష్టికి తీసుకుపోవడం లేదు. పేరెంట్స్ కి తెలిస్తే తమను చదువు మాన్పించి వేస్తారేమోనన్న భయంతో అమ్మాయిలు వారికి చెప్పుకోవడం లేదు.

Related Posts