అమరావతిలో ఇన్ సైడ్ వార్
విజయవాడ, డిసెంబర్ 28
టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లపై జగన్ సర్కార్ విచారణకు సిద్ధమయ్యింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో న్యాయ నిపుణుల సలహా తీసుకొని దర్యాప్తు బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నది తేల్చనున్నారు. సీబీఐకే ఈ కేసు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల వివరాలు తమ దగ్గర ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కొందరు నేతలు తమ డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేర్లతో కూడా భూములు కొన్నారని మంత్రి పేర్ని నాని అన్నారు.ప్రభుత్వం సంగతి పక్కన పెడితే సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అమరావతి పరిధిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల పేర్లు.. వివరాలు చెప్పుకొచ్చారు. క్విడ్ ప్రో కో రూపంలో రాజధాని ప్రాంతంలో బినామీలతో భూములు కొన్న తెలుగుదేశం నాయకుల మీద విచారణకి ఆదేశించనున్న ప్రభుత్వం.. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ - రాజధాని భూ దోపిడీ అంటూ ఓ లిస్ట్‌ను పోస్ట్ చేశారు.ఈ జాబితాలో మాజీ మంత్రి నారాయణ పేరు ఉంది.. ఆయన తన బంధువుల పేరు మీద రూ.432 కోట్లు పెట్టి అసైండ్ భూములతో కలిపి, కొన్న భూములు 3,129 ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. తుళ్ళూరు మండలంలోని మందడం , లింగాయపాలెం , రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, బొరుపాలెంలో ఈ భూములు ఉన్నాయన్నారు.మాజీ మంత్రి నారా లోకేష్ పేరును కూడా ప్రస్తావించారు. రూ.50 కోట్లు పెట్టి కొన్న భూములు 500 ఎకరాలు.. అమరావతి మండలంలోని ధరణి కోట , వైకుంఠపురం ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయన్నారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రూ.35 కోట్లు పెట్టి కొన్న భూములు 700 ఎకరాలని.. ఇవి గుడి మెట్ల , కీసర , వీరుల పాడులో ఉన్నాయన్నారు. ఈ భూముల్ని ఆయన తన కుటుంబ సభ్యుల పేరుపై కొనుగోలు చేశారన్నారు.మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు మీద 196 ఎకరాల భూములు ఉన్నాయని.. అవి తుళ్లూరు మండలంలోని మందడం, ,వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. మరో మాజీ మంత్రి రావెల కిషొర్ బాబు రూ.5.5 కోట్లు పెట్టి కొన్న భూములు 55 ఎకరాలని.. ఆ భూములు మంగళగిరి మండలంలోని కురగళ్ళు , నవలూరులో ఉన్నాయన్నారు. మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ పేరుపై తాడేపల్లి మండలం కుంచెనపల్లి 53 ఎకరాలు భూములు ఉన్నాయన్నారు.మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బాబు పేరుపై అమరావతి టౌన్ షిప్ దగ్గర ఎర్రబాలెంలో 42 ఎకరాలు ఉన్నాయని.. ఈ భూములకి లాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్ పేరు మీద 17.3 ఎకరాల భూమి సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ళ గ్రామంలో ఉందన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పేరు మీద నంబూరు సమీపంలో 50 ఎకరాల భూమి ఉందన్నారు.టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరు మీద ఐనవోలు ప్రాంతంలో 4.09 ఎకరాల భూమి ఉందన్నారు. ఇక లింగమనేని రమేష్ పేరు మీద 804 ఎకరాల భూమి ఉందని లిస్ట్‌లో ప్రస్తావించారు. ఇక రామారావు అనే వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువని.. ఆయనకు 498.83 ఎకరాలు కేటాయించారని ఆరోపించారు. ఈ భూములు జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురంలో కేటాయించారన్నారు