YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తొందరపడి కూసిన విజయసాయిరెడ్డి

తొందరపడి కూసిన విజయసాయిరెడ్డి

తొందరపడి కూసిన విజయసాయిరెడ్డి
విశాఖపట్టణ:, డిసెంబర్ 28
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తొందరపడ్డారా? మంత్రి వర్గ సమావేశం జరగకముందే విజయసాయిరెడ్డి సెక్రటేరియట్ లో భీమిలీలో ఉంటుందని చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా.. క్యాపిటల్ గా ప్రకటించిన అనంతరం తొలిసారి విశాఖలో వైఎస్ జగన్ పర్యటిస్తారని, జగన్ కు అభినందనలు తెలుపుతూ 24 కిలోమీటర్ల మానవహారం చేయాలని పిలుపునిచ్చారు. అయితే క్యాబినెట్ మీటింగ్ లో రాజధాని అమరావతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విజయసాయిరెడ్డి ప్రకటనకు విలువ లేకుండా పోయింది.నిజానికి విజయసాయిరెడ్డి పార్టీలో సీనియర్ నేత. జగన్ కు అత్యంత సన్నిహితుడు. విజయసాయిరెడ్డికి తెలియకుండా ప్రభుత్వంలో ఏమీ జరగదన్నది అందరికీ తెలిసిందే. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నా విజయసాయిరెడ్డి ఊరికే ఆషామాషీగా ప్రకటన చేయరు. కానీ విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన తర్వాత కూడా కేబినెట్ మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో విజయసాయిరెడ్డికి రాజధాని విషయంలో అసలు ఏం జరుగుతుందో తెలియదనే అనుకోవాలా? లేక కావాలని చెప్పారని భావించాలా? అన్నది తెలియక పార్టీలో నేతలే తికమక పడుతున్నారు.విజయసాయిరెడ్డి గత ఎన్నికలకు కంటే ముందు విజయసాయిరెడ్డి విశాఖ ప్రాంత ఇన్ ఛార్జిగా నియమితులయ్యారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా ఎక్కువ సమయం విశాఖ ప్రాంతానికే ఎక్కువ సమయం కేటాయించారు. పార్టీని విశాఖ ప్రాంతంలో పటిష్ట పర్చడానికి విజయసాయిరెడ్డి కృషి చేశారు. కానీ ఇప్పుడు విశాఖ ఎగ్జిక్యూటివ్ విషయంలో విజయసాయిరెడ్డి అంచనాలు తప్పయ్యాయి. ఇప్పడు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Related Posts