Highlights
- 5 నెలల శిక్షణ కాల పరిమితి
- 3 కేంద్రాలు ఏర్పాటు
- తెలుగు మాధ్యమంలో 120 సీట్స్
- ఇంగ్లీష్ మాధ్యమంలో మరో 120 సీట్స్
- ఏప్రిల్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ పి.పార్వతీ వెల్లడి
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్స్ లో 5 నెలల శిక్షణ కార్యక్రమంలో 3 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతొందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ పి.పార్వతీ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కేంద్రాలలో తెలుగు మాధ్యమంలో 120 సీట్స్ , ఇంగ్లీష్ మాధ్యమంలో మరో 120 సీట్స్ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంతున్నామని ఆమె తెలిపారు. పీఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, విజయవాడ, రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, 1-1720, గాంధీనగర్, కడప, వావిలాల సంస్ట్ లైబ్రరీ సైన్స్, అరుండల్ పేట, గుంటూరు లలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో UGC గుర్తింపు పొందిన ఏదైనాయూనివర్సిటీ నుంచి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తత్సంభంద కోర్స్ లలో ఉత్థిర్ణత సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లో ఓకేషనల్ కోర్స్ చదివిన వారికి అవకాసం లేదు. డిగ్రీ పూర్తి చేసిన వారికి 5 మార్కులు, పి.జి. చేసిన వారికి 10 మార్కులు అర్హత సాదించినమార్కులకు కలపడం జరుగుతుంది. జి ఓ ఎమ్ ఎస్ నెం. 140, ఎడ్యుకేషన్ తేదీ. 23.5.1987 మేరకు సీట్స్ భర్తీ చేస్తామని తెలిపారు. వీటి లో 33 - 1/3 సీట్స్ మహిళలకు కేటాయించడం జరుగుతుంది. 10 శాతం సీట్స్ జిల్లా గ్రంధాలయ సంస్థ, ప్రభుత్వ లైబ్రరీ లు మరియు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ లలో పనిచేస్తున్న వారికి కేటాయించడం జరుగుతుంది. దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి అందుబాటులో ఉంటాయి. సంబంధింత ప్రిన్సిపాల్ నుంచి నిర్ణిత దరఖాస్తులు పొందవొచ్చు. ఇందుకోసం రూ.2/- ఇండియన్ పోస్టల్ ఆర్డర్ "ప్రిన్సిపల్ ఆఫ్ దీ ఇనిస్టిట్యూట్" పేరున తీసుకొని, రూ.5 /- పోస్టల్ స్టాంప్ అతికించిన 10 X 24 కవర్ జతచేసి దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ను 5.5.2018 వరకు అందుబాటులో ఉంటాయని, వ్యక్తిగతంగా గాని, పోస్టల్ ద్వారా గాని దరఖాస్తులు 13.5.2018 లోగా చేరవలసి ఉంటుందని పార్వతి తెలిపారు.