మండలం లో బంద్ ప్రశాంతం
కౌతాళం డిసెంబర్ 28
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కౌతాళం లో బంద్ ను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ప్రింటింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇంటర్ డిగ్రీ పీజీ కళాశాల జయప్రదం చేయాలని కోరుతూ అనంతరం మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. సమావేశంలో కౌతాళం మండలం అధ్యక్షుడు కుమార్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పిల్లవాడికి నేను ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చదివిస్తాను అని మాట ఇచ్చి తీరా అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్ణయంలో చేస్తుందని అందుకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో వల్ల ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను విద్యార్థులకు తల్లిదండ్రులకు పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల కాలంలో వినతిపత్రం నిరసన కార్యక్రమం చేసిన కూడా ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు గా వ్యవహరించడం నిధులను విడుదల చేయక పోవడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ , ప్రభుత్వ పాఠశాల కళాశాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఏ ఐ ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు కుమార్ ఉపాధ్యక్షుడు ఉపేంద్ర మండల కార్యదర్శి గురు నరసింహులు నాగేంద్ర కృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.