YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

సొమాలియా భారీ పేలుడు76 మంది మృతి

సొమాలియా భారీ పేలుడు76 మంది మృతి

సొమాలియా భారీ పేలుడు76 మంది మృతి
సొమాలియా డిసెంబర్ 28 
సొమాలియా రాజధాని మొగధీషులో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 76 మంది మృతి చెందారు. నగరానికి చెందిన ఓ చెక్‌ పాయింట్‌ వద్ద ఉన్న కలెన్షన్‌ సెంటర్‌ సమీపంలో ఈ శక్తివంతమైన పేలుడు జరిగింది. ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. సొమాలియాలో సాధారణంగా ఆల్‌ఖయిదా అనుబంధ సంస్థ అల్‌ షబాబ్‌ తరుచూ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూనే ఉంటుంది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 76 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆమిన్‌ అంబులెన్స్‌ డైరక్టర్‌ అబ్దుల్‌కాదిర్‌ అదన్‌ తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతిచెందినవారిలో విద్యార్థులు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు.

Related Posts