సీఏఏ వివాదం .. యూపీ లో 1246 మందిని అరెస్ట్
లక్నో డిసెంబర్ 28
దేశం లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న వారు ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తుండటం తో ఆందోళనకారులపై యూపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలను తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యూపీ పోలీసులు విడుదల చేసిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులు చేస్తున్న 20950 మందిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ 95 కేసులు నమోదు చేశారు. వీటిల్లో 10380 ట్విట్టర్ పోస్టులు 10339 ఫేస్బుక్ పోస్టులు 181 యూట్యూబ్ పోస్టులు ఉన్నాయి. సీఏఏ నిరసనలు హింసాత్మకం గా మారి ప్రజా ఆస్తుల విధ్వంసానికి దారితీయడంతో వీటితో ప్రమేయమున్న వారిని గుర్తించి వారి ఆస్తుల స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆస్తుల విధ్వంసానికి సంబంధించి 498 కేసులను పోలీసులు రిజిస్టర్ చేశారు. ఎప్పటికి 5558 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిలో 1246 మందిని అరెస్టు చేశారు. హింస ను రెచ్చగొట్టిన వారిని విచారణ చేస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. యూపీలో చెలరేగిన హింసాకాండ ఘటనల పై సిట్ తాజాగా దర్యాప్తు చేస్తోంది