YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రామ వార్డు సచివాలయం లో మౌలిక సదుపాయాలు కల్పించాలి 

గ్రామ వార్డు సచివాలయం లో మౌలిక సదుపాయాలు కల్పించాలి 

గ్రామ వార్డు సచివాలయం లో మౌలిక సదుపాయాలు కల్పించాలి 
- కలెక్టర్ జి వీరపాండియన్
కర్నూలు, డిసెంబర్ 28
గ్రామ, వార్డు సచివాలయంలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులుకు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎం పి డి ఓ, ఈవోపీఆర్డీ, మున్సిపల్ కమిషనర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం లోపు గ్రామ వార్డు సచివాలయం లో ఎలక్ట్రిషియన్, పెయింటింగ్, డెస్క్ టాప్, ల్యాప్ టాప్, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు 100% కచ్చితంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. జనవరి ఒకటో తేదీ నాటికి అన్ని గ్రామ వార్డు సచివాలయం ప్రారంభమై, అన్ని సేవలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవో లదే అన్నారు. అదేవిధంగా ఈ సచివాలయం కింద గ్రామ, వార్డు సెక్రటేరియట్ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు సెక్రటరియేట్ లాగిన్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా సచివాలయల బిల్డింగ్, మౌలిక సదుపాయాలు వంటివి ఈ సచివాలయంలో అప్డేట్ చేయాలన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అందులో భాగంగా సచివాలయ సదుపాయాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయం లో నేమ్ బోర్డ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్ రావు, వెంకటసుబ్బయ్య, జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts