YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంతా నిరుపయోగం (విజయనగరం)

అంతా నిరుపయోగం (విజయనగరం)

అంతా నిరుపయోగం (విజయనగరం)
పార్వతీపురం, డిసెంబర్ 28 ఏజెన్సీలో సంతల కోసం నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి. లక్షలు పోసి నిర్మించిన వీటిని వినియోగించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాలైన గుమ్మలక్ష్మీపురం, సాలూరు, కురుపాం, పాచిపెంట, మక్కువ, కొమరాడ తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వారపు సంత జరుగుతుంది. ఆయా సంతలకు సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున గిరిజనులు అటవీ ఉత్పత్తులు తీసుకొస్తుంటారు. వారపు సంతల్లో సౌకర్యాలు మాట పక్కనబెడితే సంతకు వచ్చిన గిరిజనులు సేదతీరేందుకు, వ్యాపారులు చేపట్టేందుకు రూ.లక్షలు వెచించి షెడ్లు నిర్మించినప్పటికీ ఎక్కడా వినియోగంలో లేకపోవడం విచారకరం. ఐటీడీఏ పరిధిలోని నిర్వహిస్తున్న అన్ని సంతలూ ప్రధాన రహదారులపైనే జరుగుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. అలాంటి ఇబ్బందులు తొలగించేందుకే షెడ్డులు నిర్మించారు. వీటివద్ద వ్యాపారాలు చేపట్టేందుకు అనువుగా లేకపోవడంతో వినియోగించేందుకు ముందుకు రావడం లేదని పలువురు వ్యాపారులు అంటున్నారు. చెంతనే సుందరమైన షెడ్డులు ఉన్నప్పటికీ చిన్ని చిన్న పాకలు నిర్మించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా షెడ్డులు నిర్మించడం వల్ల ప్రజాధనం వృథా అయ్యిందే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సంతషెడ్లు నిర్మాణం పనులు ఐటీడీఏ అధికారులు చేడుతున్నారు. పనులు పూర్తయిన వెంటనే తమకు సంబంధం లేనట్లు మిన్నకుండిపోతున్నారు. జీసీసీకి అప్పగించినప్పటికీ పట్టించుకోలేదు. అదే బాటలో పంచాయతీ అధికారులు సైతం నిర్వహణపైన శ్రద్ధకనబర్చడం లేదు. శాఖల మధ్య సమన్వయలోపంతో సుందరమైన షెడ్డులు దిష్టి బొమ్మలను తలపిస్తున్నాయి. వారపు సంతలకు ఒడిశా ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాల నుంచి పెద్దఎత్తున హాజరవుతుంటారు. అటవీ ఫలాలు తీసుకొచ్చి వారంరోజులకు సరిపడా నిత్యావసర సరకులు తీసుకెళుతుంటారు. కొండలపై నుంచి కాలినడకన వస్తున్న గిరిజనులకు దాహం కేకలు తప్పటం లేదు. సంతల ఆవరణలో కనీసం తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు అవస్థలు పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల్లో నిర్వహిస్తున్న వారపుసంత నిర్వహణపై ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టిసారించినట్లయితే షెడ్డులు వినియోగంలోకి రావడంతో పాటు పంచాయతీలకు ఆదాయం సైతం వస్తుంది. షెడ్డులోని వ్యాపారాలకు కేటాయించిన సముదాయాలకు నంబర్లు వేసి, ఒక్కో సముదాయాన్ని ఒక్కో వ్యాపారికి అప్పగించి వారానికి రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తే కనీసం నిర్వహణ ఖర్చులకైనా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

Related Posts