YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీపైనే కమలం గురి

ఢిల్లీపైనే కమలం గురి

ఢిల్లీపైనే కమలం గురి
న్యూఢిల్లీ, డిసెంబర్ 30, 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరస ఓటములతో దేశంలో మోదీ, షా నాయకత్వంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టిగా భావిస్తుంది. చేజారిపోయిన రాష్ట్రాలను పక్కన పెట్టి కొత్తగా ఎన్నిక జరగనున్న రాష్ట్రాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఢిల్లీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరి నెలలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఢిల్లీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించింది. ఎప్పుడైనా షెడ్యూలు విడుదల చేసే అవకాశముంది.మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోెణపు పోటీలో నెగ్గడం సులువేనని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ ముఖ్యనేతలు పాల్గొనేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది. అవినీతి లేని పాలన గత ఐదేళ్లుగా అందించడం అరవింద్ కేజ్రీవాల్ కు ప్లస్ పాయింట్. అయితే సమస్యలను పరిష్కరించడంలో ఆయన అనుకున్న విధంగా వ్యవహరించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదన్నది అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ప్రాంతంలో బలంగా ఉంది. అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలసి పోటీ చేస్తేనే తప్ప విడివిడిగా పోటీ చేస్తే తమకు లాభమని బీజేపీ భావిస్తుంది.లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించినా అవే ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. హర్యానా, జార్ఖండ్ ఎన్నికల ఫలతాలే ఇందుకు నిదర్శనం. అందుకే ఈసారి పక్కాగా ఢిల్లీలో పాగా వేసేందుకు ప్లాన్ చేయాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముఖ్యనేతలతో ఆయన భేటీ అయి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పోయిన పరువును తెచ్చుకునేందుకు ఢిల్లీ అసెంబ్లీని గెలుచుకోవాలని కమలనాధులు గట్టిగా భావిస్తున్నారు.

Related Posts