6న అల వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్
హైద్రాబాద్, డిసెంబర్ 30,
సంక్రాంతి బరిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే ఈ ఏడాదికే బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అల వైకుంఠపురములో’ ఆల్బమ్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ విజయోత్సవాన్ని అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో నిర్మాతలు నిర్ణయించారు. అందుకే, జనవరి 6న ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అధికారికంగా ప్రకటించారు.‘అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్‌కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో మ్యూజికల్ కాన్సెర్ట్’ను వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నాం’’ అని పేర్కొన్నారు.కాగా, ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ముఖ్య పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుంది.