YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో

రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో

.రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో
హుస్నాబాద్, డిసెంబర్ 30,
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లిలో రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హుస్నాబాద్ నుండి సిద్దిపేట కు వెళ్లే ప్రధాన రహదారి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజేరుపల్లి మైసంపల్లి గ్రామాలకు తారు రోడ్డు వెయ్యడానికి 9 నెలల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేయగా పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ మట్టి రోడ్డుపై కాంక్రీట్ పోసి వదిలేశాడు. దీంతో 9 నెలలుగా గ్రామస్తులు ఈ కాంక్రీట్ రహదారిపై ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయాన ఎమ్మెల్యే సతీష్ కుమార్ దత్తత గ్రామమైన  మైసంపల్లి గ్రామానికి వేయాల్సిన రహదారి విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ మండిపడ్డారు. ఈ రహదారి నుండి కోహెడ బెజ్జంకి మీదుగా వేములవాడ వరకు ప్రయాణాలు కొనసాగుతాయని ప్రస్తుతం రహదారి బాగాలేక బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారన్నారు. ఇప్పటికే ఈ రహదారిపై 20 మంది వరకు ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యి ఆస్పత్రుల పాలయ్యారని వెంటనే రహదారికి బిల్లులు మంజూరు చేసి రహదారిపై తారు వేయించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే ఈ రహదారిపై చొరవ చూపని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకొని నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Related Posts