YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాక్సాఫీస్ కి చేరని 'ఎమ్మెల్యే' 

Highlights

  • ఎంఎల్ ఏ రివ్యూ
  • ఎమ్మెల్యే ఓ రొటీన్ ఫార్ములా సినిమా
బాక్సాఫీస్ కి చేరని 'ఎమ్మెల్యే' 

శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎమ్మెల్యే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకోలేకపోయింది. నందమూరి కళ్యాణరామ్, కాజల్ జంటగా నటించిన  ఈ సినిమా గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే ఓ రొటీన్ ఫార్ములా సినిమా చెప్పొచ్చు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన సహజశైలిలో బాగానే నటించాడు. కథ విషయానికి వస్తే పలు సినిమాల్లో చూసిన తరహా కథలను కలిపి కొత్తగా సినిమా తీశారనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. హీరోయిన్ కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఇదేదో భావోద్వేగ బంధం అని భావించిన కళ్యాణ్ రామ్ నేరుగా వెళ్లి కాజల్ కు ఐ లవ్ యూ చెబుతాడు. మరి వీరి లవ్ ట్రాక్ ఎన్ని మలుపులు తిరుగుతుంది?. అసలు కళ్యాణ్ రామ్ ఎందుకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరి ప్రేమ సఫలం అయిందా? వెండితెరపై చూడాల్సిందే. సినిమా ఫస్టాఫ్ లో పోసాని కృష్ణమురళీ..అప్పుడప్పుడు వెన్నెల కిషోర్ లు నవ్విస్తారు.


ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిగా ముందుకొచ్చాడు. కాకపోతే సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక కథే కారణం. ఈ సినిమాలో కళ్యాణరామ్ తన చెల్లిని  ప్రేమించిన యువకుడికి ఇఛ్చి పెళ్ళి చేసేస్తాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ పనిచేయటంతో కొత్తగా పెళ్లైన జంటతో పాటు…కళ్యాణ్ ను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు. బావ, చెల్లితో కలసి కళ్యాణ్ రామ్ బెంగుళూరు వెళతాడు. అక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు. కొత్తగా వెళ్లిన ఈ ముగ్గురూ  బెంగుళూరులో సరదాగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతుంటారు. అయితే వీళ్ళు దిగిన సెల్ఫీల్లో విచిత్రంగా ప్రతి చోటా ‘కాజల్’ ఉంటుంది.

సినిమాలో విలన్ గా నటించిన రవికిషన్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఓ మంచి పాత్ర పోషించారు. సినిమాలో పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. థర్టీ ఇయర్స్ పృథ్వీ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.  పాటల్లో ఎక్కడా రిచ్ నెస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

Related Posts