YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

రాజన్న సన్నిధిలో కేసీఆర్

రాజన్న సన్నిధిలో కేసీఆర్

రాజన్న సన్నిధిలో కేసీఆర్
కరీంనగర్, డిసెంబర్ 30,
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం పర్యటించారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 10. 30 గంటలకు సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు.తొలుత వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆయన, 11.50 గంటలకు మిడ్‌ మానేరు డ్యాంను సందర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన శ్రీరాజరాజేశ్వర(మధ్య మానేరు) జలాశయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిశీలించారు. మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు కేసీఆర్‌ పూజలు నిర్వహించి, తంగళ్లపల్లి వంతెనపై జలహారతి ఇచ్చారు.అక్కడ నుంచి వేములవాడకు చేరుకున్న కేసీఆర్‌.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారుకరీంనగర్‌ జిల్లాలోని తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌కు చేరుకుని, అక్కడ అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మిడ్‌ మానేరు డ్యాంను పూర్తిస్థాయి నీటి మట్టం నింపడం ఇదే తొలిసారి. ఈ జలాశయం కింద 2.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగులోకి రానుంది.

Related Posts