YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

.మాఫియా మాయ 

.మాఫియా మాయ 

.మాఫియా మాయ 
ఆదిలాబాద్, డిసెంబర్ 29  ప్రస్తుతం ఇసుక బంగారాన్ని తలపిస్తోంది. అక్రమార్కులు ఈ దందాను మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లుగా కొనసాగిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే యథేచ్ఛగా అక్రమరవాణా సాగుతోంది. జిల్లా దాటి ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు జరిమానాలు విధిస్తున్నా ఈ వ్యవహారం ఆగడం లేదు. పెన్‌గంగ తీర ప్రాంతాల్లో ఇసుక తోడేస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న డొల్లార సమీపంలో ఉన్న పెన్‌గంగ నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్లేందుకు అక్రమార్కులు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఇసుకను తోడేందుకు జేసీబీ వాహనం ఉపయోగించి రాత్రివేళలో టిప్పర్లు, ఉదయం ట్రాక్టర్లలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ పనుల కోసం ఇసుకను తరలించాల్సి ఉంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీసుకెళ్లాలి. కానీ అలా జరగడం లేదు. వేళాపాళా లేకుండా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ అప్పుడప్పుడు జరిమానాలు విధించి వదిలేయడంతో ఈ మాఫియా విజృంభిస్తోంది. జారీ చేసిన వే బిల్లు మీద వాహన నెంబరు, పట్టుబడిన వాహనం నెంబరు పరిశీలిస్తే ప్రభుత్వ పనుల కోసమంటూ అక్రమార్కులు ఇసుకను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతుంది. అక్రమంగా ఇసుకను తరలించడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ఇసుక రీచ్‌ల్లో టెండర్లు నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. మైనింగ్‌ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఇష్టారీతిన ఈ వ్యాపారం కొనసాగుతోంది. తరలించిన ఇసుకను భవనాలు నిర్మించుకునే యజమానులతో ముందే ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ట్రాక్టరుకు రూ.2500 నుంచి రూ.2800 వరకు ధర నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. జైనథ్‌, బేల మండలాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రోజూ పెన్‌గంగా పరివాహక గ్రామాల నుంచి వందల కొద్దీ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. జిల్లా కేంద్రానికి తీసుకెళ్లే క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గ్రామ సరిహద్దుల్లో ఇసుక డంపు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి వేళల్లో టిప్పర్‌లో నింపి చిన్న టిప్పర్‌కు రూ.8 వేలు, పెద్ద టిప్పర్‌కు రూ.16 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారులు జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఇసుక దోపిడీ జరుగుతూనే ఉంది.

Related Posts