YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇది నా రివ్యూ

Highlights

  • నగ్న సత్యానికి సాక్షి
  • "నీది నాది ఒకే కథ" సినిమా 
ఇది నా రివ్యూ

ఇది నా రివ్యూ.మూస సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రేక్షకుడికి , ఎడారిలో ఒయాశిస్సు లాగా దరిచేరింది "నీది నాది ఒకే కథ" ఇది అచ్చు పదహారుఅణాల తెలుగు సినిమా.మాటా -చేత ఒకటవడమే వ్యక్తిత్వం,చేతకాకపోతే అది ఫేక్.నివ్వు నీలాగే బ్రతుకు , నివ్వు నీ ఇష్టమైన పని చెయ్,నీవ్వు నీకోసమే బ్రతుకు అన్న నగ్న సత్యాన్ని "వేణు ఉడుగుల" తెరకెక్కించిన ఫిలాసఫీ ప్రతి ప్రేక్షకుడిని సంభ్రమాస్శ్చర్యానికి గురిచేస్తుంది.తను నమ్మి రాసిన ఈ కథ తెలుగు సినిమా దృక్పధాన్ని మార్చేస్తుందన్న నమ్మకం నాకు కలిగింది.ఎందుకంటే రొటీన్ సినిమాలు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు, తను చూడని తండ్రి, కొడుకుల సంఘర్షణను ఈ సినిమాలో దర్శించడం జరుగుతుంది., అలాగే ఒక కొత్త కథను, ఫ్రెష్ స్క్రీన్ప్లే ను పొందే ఫీలింగ్ కలుగుతుంది.ఇది తప్పకుండ మారుతున్నటాలీవుడ్ ట్రెండ్ కి దోహదం చేస్తుంది.మనిషి మేల్కొన్నంత వరకు కాలం సమాజ, నీతి, రీతి అతన్ని కట్టడి చేస్తుంటాయి.సమాజం కోసం అతడు తన అసలు అంతరంగాన్ని బయట పెట్టక తెచ్చి పెట్టుకున్న ముఖంతో ప్రవర్తిస్తాడు, తరువాత ఈ ముఖాన్నే అసలైన అన్తరంగంగా భ్రమిస్తాడు.అందుకే ప్రతివాడికి అంతరంగం దూరమవుతుంటుంది.ఈ సినిమాలో నేను ఆత్మాభివ్యక్తీకరణ ( Self expression) ను దర్శించడం జరిగింది.దర్శకుడు తను తీయాలనుకున్న ప్రతిసన్నివేశాన్ని అచేతనము, కల ద్వారా దర్శించి స్వైర కల్పనలు ద్వారా అభివ్యక్తం చేసాడు అందుకోసం తన సృజనాత్మకత ప్రతివాడిని హత్తుకుంది.రుద్రరాజు సాగర్ పాత్రలో శ్రీవిష్ణు పరకాయ ప్రవేశం చేసిన తీరు సినిమాకు హైలైట్స్ 

జీవితంలో ఏది సాధించలేననే నిరుత్సాహంలో బతికే కుర్రాడిగా తను ఒదిగిపోయిన ప్రతి సన్నివేశం, తెలుగు సినిమాకు ఒక కొత్త ఆషాకిరణాన్ని చూపిచ్చింది.తండ్రి పాత్రలో దర్శకుడు దేవీ ప్రసాద్‌ నటన ఆకట్టుకొంటుంది. మధ్య తరగతి తండ్రి పడే నరకయాతన , ఆలోచనల, ఆశలకు ప్రతిరూపంగా కనిపించారు.ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా కథే అన్న అనుభూతిని పొందుతాడు.
బోటంలైన్ ..నీది నాది కథ ఇది మన అందరి కథ.
                                                                                               -- సూర్య ప్రకాష్ , సినీ విశ్లేషకులు 

Related Posts