ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు టీమిండియాలో మార్పులు
ముంబై, డిసెంబర్ 30,
భారత్‌తో వన్డే సిరీస్ ముంగిట ఆస్ట్రేలియా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 14 నుంచి భారత్ గడ్డపై టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుండగా.. ఇప్పటికే ప్రకటించిన జట్టు నుంచి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ దూరమయ్యాడు. దీంతో.. అతని స్థానంలో డీఆర్క్ షార్ట్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎంపిక చేసింది. గత ఏడాది భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఖరిగా డీఆర్క్ షాట్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తాజాగా మళ్లీ భారత్‌పైనే అతను రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.వన్డే జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్ షాట్ముంబయి వేదికగా జనవరి 14న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, 19న బెంగళూరు వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి.భారత వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ