YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

కేసీఆర్ ను అడ్డుకొనే ప్రయత్నం..అరెస్ట్

కేసీఆర్ ను అడ్డుకొనే ప్రయత్నం..అరెస్ట్

కేసీఆర్ ను అడ్డుకొనే ప్రయత్నం..అరెస్ట్
కరీంనగర్, డిసెంబర్ 30, 
వేములవాడలో మిడ్ మానేరు ముంపు బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ముందుగా ప్రకటించినట్లు తమకు నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ.. బీజేపీ నాయకులతో కలిసి కొంత మంది యువకులు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు వారిని పక్కకు లాక్కెళ్లి సీఎం కాన్వాయ్‌కి అడ్డు తొలగించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (డిసెంబర్ 30) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్.. అక్కడ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయాన్ని పరిశీలించారు.మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వహించారు. తంగళ్లపల్లి వంతెనపై గోదావరికి జలహారతి ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మిడ్‌ మానేరు డ్యాంను పూర్తి స్థాయి నీటి మట్టంతో నింపడం ఇదే తొలిసారి. ఈ జలాశయం కింద 2.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగులోకి రానుంది. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Related Posts