YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టీడీపీకి మరో షాక్

ఏపీలో టీడీపీకి మరో షాక్

ఏపీలో టీడీపీకి మరో షాక్
విజయవాడ, డిసెంబర్ 30,
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీతో సన్నిహితంగా మెలుగుతుండగా.. అదే బాటలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి పయనించనున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి.. ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడిన తర్వాత.. పార్టీ మారే విషయాన్ని గిరి ప్రకటించనున్నారు.గతంలో వల్లభనేని వంశీ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన అధికార పార్టీలో చేరనప్పటికీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోనూ టీడీపీ నేతలతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయన.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలవగా.. వైఎస్సార్సీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి దూరం అయ్యారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో.. అమరావతి విషయమై రగడ జరుగుతున్న పరిస్థితుల్లో అదే ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts