YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో మైనర్ బాలికకు పెళ్లి

ప్రకాశంలో మైనర్ బాలికకు పెళ్లి

ప్రకాశంలో మైనర్ బాలికకు పెళ్లి
ఒంగోలు, డిసెంబర్ 30, 
జన్మనిచ్చిన తల్లే తన కూతురి పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. మైనారిటీ తీరకముందే బలవంతంగా పెళ్లి చేసి.. నిర్బంధించింది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధిత బాలిక (15) వేటపాలెం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక తల్లిదండ్రులు గత 15 సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి బచ్చులవారిపాలెంలో, తల్లి జాండ్రపేటలో నివాసముంటున్నారు. అయితే బాలిక మాత్రం చిన్నప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటూ.. అప్పుడప్పుడు తల్లి వద్దకు వెళ్లి వస్తుంటుంది.అయితే మూడు నెలల క్రితం బాలిక తల్లి వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం తండ్రి వద్ద విడిచిపెడతానని చెప్పి బాలికను తల్లి బయటకు తీసుకువెళ్లింది. ఇంకొల్లు మండలం పావులూరు ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి పాత చీరాలకు చెందిన వంశీకృష్ణ అనే యువకుడితో బలవంతంగా పెళ్లి చేసింది. అప్పటి నుంచి బాలికను ఇంట్లోనే ఉంచి తాళం వేస్తున్నారు. అయితే ఆదివారం అక్కడి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న బాలిక.. వేటపాలెం పోలీసులను ఆశ్రయించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును ఇంకొల్లు పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎస్సై అజయ్‌బాబు తెలిపారు.

Related Posts