YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 గ్రామ సేవకుడి నిర్వాకం.. ఆస్పత్రిలోనే బీడీ కార్మికురాలిపై అత్యాచారం

 గ్రామ సేవకుడి నిర్వాకం.. ఆస్పత్రిలోనే బీడీ కార్మికురాలిపై అత్యాచారం

 గ్రామ సేవకుడి నిర్వాకం.. ఆస్పత్రిలోనే బీడీ కార్మికురాలిపై అత్యాచారం
మహబూబ్ నగర్, డిసెంబర్ 30
తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. వరుసగా జరుగుతున్న అత్యాచారాలతో మహిళలు వణికిపోతున్నారు. తాజాగా మహబూబునగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామంలో బీడీ కార్మికురాలిపై గ్రామ సేవకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.గ్రామానికి చెందిన 35ఏళ్ల మహిళ బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉంది. మధ్యాహ్న సమయంలో ఆమె ఇంటికి గ్రామసేవకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి వచ్చాడు. పరిచయస్తుడే కావడంతో ఆ మహిళ అతడితో మాట్లాడింది. అనారోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పిస్తానని నమ్మబలికాడు.గ్రామ శివారులోని పశువుల ఆసుపత్రిలోని ఒక గదిలో ఆరోగ్య ఉపకేంద్రం కొనసాగుతుండటంతో అక్కడికి తీసుకెళ్లాడు. ఆదివారం కావడంతో ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో మహిళను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఘోరం నుంచి తేరుకున్న బాధితురాలు గ్రామంలోకి వెళ్లి జరిగిన సంఘటన గురించి బంధువులు, గ్రామస్థులకు చెప్పింది. వారి సూచన మేరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన సోదరుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

Related Posts