YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

25 తేదీనే శ్రీరామనవమి 

Highlights

  • తిథిలోనే  శ్రీరామనవమి ఫలితం
  • పంచాంగాలు అదే చెపుతున్నాయి  
25 తేదీనే శ్రీరామనవమి 

శ్రీరామనవమిని 25 తేదీనే ఆచరించాలి. అన్ని పంచాంగాలలో కూడా శ్రీరామనవమి 25 తేదీనే వచ్చింది.నవమి తిథే లేని నాడు శ్రీరామనవమి చేస్తే ఫలితం ఉండదు. ఆంధ్రా,మరియు తెలంగాణాలో అన్నిగ్రామలలోను,పట్టణాలలోను స్మార్తులమే ఎక్కువగా వున్నారు.స్మార్తులు అంటే అన్ని దేవతలను సమానమైన భక్తిశ్రద్ధలతో పూజించేవారినే స్మార్తులు అంటారు.

స్మార్తులు అంటే? సవివరంగా తెల్పుతాను..

స్మార్తులమైన మనం వినాయకచవితినాడు శ్రీ గణపతిని, రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణమూర్తినీ, మహాశివరాత్రి పర్వదినంనాడు శ్రీ సాంబశివుణ్ణి, శ్రీదేవీశరన్నవరాత్రులలో అమ్మవారిని, శ్రీకృష్ణాష్టమి శ్రీ రామ నవమి వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాలలో శ్రీమహావిష్ణువును ఇలా అన్ని దేవతలను సమానంగా భక్తిశ్రద్ధలతో స్మార్త ఆగమం ప్రకారమే పూజలు కళ్యాణాలు చేస్తున్నాం.

లోకం అంతా శ్రీరాముడు జన్మించిన "*నవమి*" తిధికి ప్రాధాన్యతనిచ్చి శ్రీ రామ నవమి అనే పేరుతో ప్రసిద్ధమైన శ్రీరామనవమిని నవమి తిథికి ప్రాముఖ్యత లేకుండా శ్రీరామడు పుట్టిన నక్షత్రమైన ***పునర్వసు*** ఉన్న రోజున నవమి కళ్యాణం చేస్తే అది శ్రీరామనవమి కళ్యాణం కాదు కదా? శ్రీరామ పునర్వసు అవుతుంది కదా?

మరి అలాంటప్పుడు శ్రీరామనవమినాడు శ్రీ సీతారాముల కళ్యాణం చేయించాలి. అని అనుకొనే భక్తులు నవమి తిథే లేని నాడు కళ్యాణం చేస్తే **శ్రీరామనవమి** కళ్యాణం ఎలా? అవుతుంది. పైగా..భద్రాచలంలో ఎప్పుడు చేస్తే మనం అప్పుడు కళ్యాణం చేయాలని శాస్త్రం చెప్పలేదు కదా?. మనకు నవమి మథ్యాహ్నవ్యాప్తికి ఉండాలి. అదేసమయానికి పునర్వసు ఉంటే ఇంకా మంచిది.

శ్రీరాముడు చైత్ర శుక్ల నవమిరోజు పునర్వసు నక్షత్రంలో గురు నవాంశలో ఐదుగ్రహాలు ఉచ్ఛలో ఉండగా సూరుడు మేషరాశి లోకి రాగా కర్కాటక లగ్నమందు కౌసల్య గర్భమున మథ్యాహ్నం శ్రీరాముడు జన్మించాడు కొన్నిపండుగలు తిధి ప్రామాణికం చేసి నిర్ణయిస్తారు శ్రీరామనవమికి తిదే ముఖ్యము. ధర్మసింధూ, నిర్ణయసింధు,అగస్త్యసహింత,వ్రత నిర్ణయ కల్పవల్లి మొదలైన గ్రంధములే ప్రామాణికం.

కావున భద్రాచలంలో ఎప్పుడు చేస్తే అప్పుడు శ్రీరామనవమి చేయరాదు.. స్మార్త ఆగమం ప్రకారము శ్రీరామనవమి మార్చి 25 తేదీన ఆచరించగలరు!! మనది పాంచరాత్ర ఆగమం కాదు? 25/03/2018 తేదీనే శ్రీరామనవమి అందరూ ఆచరించగలరు ఇదే సరైనది !! 

Related Posts