YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు పర్యాటక శాఖ మంత్రి. శ్రీనివాస్ గౌడ్

టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు పర్యాటక శాఖ మంత్రి. శ్రీనివాస్ గౌడ్

 టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు
       పర్యాటక శాఖ మంత్రి. శ్రీనివాస్ గౌడ్

> రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో ఏపి తెలంగాణ కు చెందిన టూర్స్ & ట్రావెల్స్ ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పర్యాటక రంగ అభివృద్ధి కి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. బోగస్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ ల కారణంగా రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ  పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా నిబంధనలు పై రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  మనోహర్  తో చర్చించారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖలో  గుర్తింపు నమోదు చేసుకోవాలనే విధంగా విధి విధానాలు రూపొందించాలని టూరిజం ఏండి ని మంత్రి నివాస్ గౌడ్ ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తున్న రంగమన్నారు. పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, పర్యాటకాన్ని సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.  టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేసి  వాటి అభివృద్ధి కి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా కాళేశ్వరం, లక్నవరం, సోమశిల, బుద్ధవనం, మయూరి ఎకో పార్క్, రామప్ప, పిల్లల మర్రి, మానేరు డ్యామ్, అలంపూర్ లోని జోగులంబా, మల్లెల తీర్థం, మన్ననూరు మొదలైన  పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి  చేస్తున్నామన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్  అసోసియేషన్ లు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను  పెద్ద ఎత్తున పర్యాటకులను తీసుకవచ్చేందుకు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు.>  పర్యాటకులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రమోషన్ కు కృషి చేస్తున్న   టూర్ ఆపరేటర్ లకు అవార్డులు, తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ లో అన్ని పర్యాటక ప్రదేశాలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, అందుకు తగిన ప్రచారం కల్పించాలన్నారు మంత్రి.  రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. ఏపి అండ్ తెలంగాణ కు చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ లతో  త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం ఏండి మనోహర్, ఏపి తెలంగాణ టూర్స్ అసోసియేషన్ చైర్మన్ నగేష్, సెక్రెటరీ సాయిబాబా బాదం, టూర్ ఆపరేటర్ హేమంత్ పాండే, సుధీర్ రెడ్డి, రమేష్, విక్రమ్ మరియు తదితర టూర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.

Related Posts