31 డిసెంబర్ జీరో ఆక్సిడెంట్ టార్గెట్‌గా చర్యలు: మహేష్ భగవత్..
31 డిసెంబర్ జీరో ఆక్సిడెంట్ టార్గెట్‌గా చర్యలు చేపడతామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓఅర్ఆర్‌పై మంగళవారం రాత్రి లైట్ మోటర్ వెహికిల్స్, ప్యాసింజర్ వెహికిల్స్‌ను.. రాత్రి 11గంటల నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే మంగళవారం రాత్రి రాచకొండ కమిషనర్ పరిధిలో ఫ్లైఓవర్ల మూసివేస్తున్నట్లు తెలిపారు. కామినేని, ఎల్బీనగర్ ఫ్లై ఓవర్లు... చింతల్ గూడ అండర్ పాస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. స్పీడ్ కంట్రోల్ కోసం 43 చెక్ పోస్టులు, 23 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు ఏర్పాటు చేస్తున్నట్లు మహేష్ భగవత్ చెప్పారు.