YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరువును శావ్వితంగా పారదోలుతాం: సీఎం కేసీఆర్

కరువును శావ్వితంగా పారదోలుతాం: సీఎం కేసీఆర్

కరువును శావ్వితంగా పారదోలుతాం: సీఎం కేసీఆర్

 మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం కేసీఆర్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్‌ భాగంగా ఉన్నటువంటి అప్‌టూ మిడ్‌మానేరు లింక్‌ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దానితో మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. దీనిలో కనిపించే తక్షణ లబ్ధి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో ఏ మాత్రం సంబంధం లేకుండా దిగువన ఉండే ఆయకట్టు మొత్తం, కొత్త ఆయకట్టు కలుపుకుని అద్భుతంగా రెండు పంటలు పండే ఆస్కారం ఏర్పడింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, బ్యారేజీల్లో 60 టీఎంసీల వరకు మొత్తం 100 టీఎంల నిలువ ఉంది. ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ తొలిగిపోయింది. రైతులు మొగులుకు మొఖం చూడకుండగా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. ఇది వాస్తవానికి 2001 ఏప్రిల్‌లో కరీంనగర్‌ ఎస్సార్‌ కాలేజీలో తొలి సిహగర్జన సభలో నేను ఆరోజు చెప్పాను. ఖచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌ ఏరియాల్లో కరువు ఉండకూడదు. కాని తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయి.తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డేల్టాకంటే అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు మీద నిలుచొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో సఫలత్వం కలిగినట్లు అనుభూతి కలిగింది. కరీంనగర్‌ జిల్లా గొప్పతనం ఏమిటంటే మొత్తం జిల్లాలో 46 వాగులు ఉంటాయి. ఇన్ని వాగులు ఉండి కూడా కరువుకాటకాలకు లోనైంది. ఇదే జిల్లా నుంచి దుబాయి, గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్లారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు భారిన పడ్డాయి. ఏడు వందల నుంచి 9 వందల ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో బిక్షపతి అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చావులు పరిష్కారం కాదు.. చావకండి అని అప్పటి కలెక్టర్‌ గోడలపై నినాదాలు రాయించారు. 60 ఏండ్ల స్వతంత్రం తరువాత ఈ నినాదాల మనం చూసేది అని కండ్ల నీళ్లు వచ్చినై.కాని ఇప్పుడు లక్ష్మీ, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు అన్ని కలిపి 145 కిలోమీటర్ల గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్‌ జిల్లాకు జీవధార. అటు పక్క, ఇటు పక్కన ఉన్న బోర్ల నుంచి నీరు మోటర్ల లేకుండానే నీళ్లు పోస్తున్నాయి. మిడ్‌ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు అద్భుతంగా పైకి ఎగిసిపడుతున్నాయి. కాకతీయ కాలువ పాత కరీంనగర్‌ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. కాకతీయ కాలువ రెండు పంటలకు తొమ్మిది నెలలు పారుతుంది. వరుద కాలువ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంటుంది. ఈ కాలువ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న బాధ్యత రాష్ట్రం మీద ఇతర ఏ పార్టీలకు ఉండదు. మొత్తం రాష్ర్టానికి ఏం కావాల్నో టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలిసినంతా ఆయా జిల్లాల్లో ఉన్న సీనియర్‌ నాయకులకు కూడా తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా 1230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్‌ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1250 కోట్లతో కరీంనగర్‌ జిల్లాలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని, మానేరు రివర్‌పై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. నీళ్లు వృధా పోకుండా జూన్‌లోగా ఈ చెక్‌డ్యాంలు నిండాలని ఆదేశించాం.గతంలో కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్‌ జిల్లా కాకతీయ కాలువ, వరుద కాలువ, మానేరు, కాళేశ్వరం డ్యాంల నీటితో పాలుగారే జిల్లాగా జూన్‌ తరువాత మనం చూడబోతున్నాం. ఇప్పుడు కలకలలాడుతున్న రాజరాజేశ్వర స్వామి జలాశయం, లోయర్‌ మానేరు జలాశయం నిండు కుండలా ఉంటాయి. తాగు, సాగునీటికి రెండు పంటలకు శాశ్వత పరిష్కారం దొరికింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వంత కష్టం పెట్టుబడితో రైతులు బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. అధికారికంగా 24 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. అనాధికారికంగా మరో మూడు లక్షల పంపు సెట్లు ఉంటాయి. అవి 40వేల కోట్లు తెలంగాణ రైతాంగం తమ స్వంత డబ్బుతో ఏర్పాటు చేసుకున్నవే. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లుకు ఉపయోగకరంగా ఉంటుంది.
> సుమారు రూ. 440 కోట్లతో మానేరు చెక్‌ డ్యాంలు, సుమారు రూ.40 కోట్లతో మూలవాగు చెక్‌డ్యాంలు పూర్తి చేసుకోవాలి. జూన్‌లోగా ఇవి పూర్తి చేసి నీటితో నింపుకునేలా సిద్ధంగా ఉండాలి. లండన్‌ నగరంలో థేమ్స్‌ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నది కూడా అలాగే ఉంటుందని నేను అంటే కొందరు సన్నాసులు వక్రభాష్యాలు చెప్పారు. జూన్‌ తరువాత అలా మాట్లాడిన సన్నాసులకు మనం చేసిన పని కనిపిస్తుంది. కరీంనగర్‌ మానేరు, మిడ్‌మానేరు, సిరిసిల్ల, వేములవాడ, కాళేశ్వరం ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేస్తాం. పాపికొండల నడుమ గోదావరి కనిపించినట్లే సిరిసిల్లలో అలాగే కనబడుతుంది. ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. ఎవరూ పైరవీలు చేయలేదు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి చేసినం. రాజకీయ వివక్ష లేకుండా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పూర్తి చేసినం. రాష్ట్రంపై మాకున్న పట్టును ఇలాగే కొనసాగిస్తాం.

Related Posts