YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయo

 అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయo

 అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయo
హాకా భవనంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో అయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం అందించనున్నాం. 240 మండలాల్లో అయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమైనవని కేంద్రం తేల్చింది. 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 40 వరకు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాం.రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీకి అనుబంధంగా రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సెస్‌ ఉన్నాయి. ఇంట్లో కుండీల్లోనే కూరగాయలు పండించే పరిజ్ఞానాన్ని ములుగు, జీడిమెట్లలో అభివృద్ధి చేశారు. వాటిని సందర్శించి మనకు అవసరమైన కూరగాయలను మన ఇంటి పరిసరాల్లో ఎలా పండించుకోవాలో తెలుసుకోవచ్చు. ఒక ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంట్లోనే పండించుకోవచ్చు. పంటల కాలనీల ఏర్పాటుపై అధ్యాయనం చేస్తున్నాం. అవగాహన లేక మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. అధిక రసాయనాల వినియోగం వల్ల దిగుబడి తగ్గడంతో పాటు నేల నిస్సారం అవుతుంది. అధికారులు భూసార పరీక్షలపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Related Posts