YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై రేపు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై రేపు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై రేపు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో రేపు రాత్రి 11 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైనా, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్‌టవర్స్‌, మైడ్‌స్పేస్‌, కామినేని, ఎల్బీనగర్‌, తెలుగుతల్లి, నల్లగొండ చౌరస్తా, పంజాగుట్ట, ఫ్లైఓవర్లు, చింతకుంట అండర్‌పాస్‌ మూసివేస్తున్నట్లు తెలిపారు. వాహనాల వేగం నియంత్రణకు పలు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Related Posts