YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!

పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!

పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!
ముంబై, డిసెంబర్ 31
పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా కనిపించింది. దీంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.30 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.37,270కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.20 తగ్గుదలతో రూ.40,670కు క్షీణించింది.బంగారం ధర గత రెండు వారాలుగా పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.1,300కు పైగానే పెరిగింది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం కస్టమర్లకు ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు పసిడి ధర దిగొచ్చింది.బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.50 క్షీణించింది. దీంతో ధర రూ.49,300కు తగ్గింది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఈ రోజు తగ్గడం గమనార్హం.అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ మార్కెట్‌లో గత రెండు వారాల పసిడి పరుగు కారణంగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధర కొంత మేర తగ్గిందన్నారు.ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.38,050కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.39,250కు దిగొచ్చింది. కేజీ వెండి ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.49,300కు క్షీణించింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1,517.85 డాలర్లకు క్షీణించింది. ఇది 2 వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.05 శాతం క్షీణతతో 17.96 డాలర్లకు తగ్గింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 22 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.బంగారం ధర ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి దాకా చూస్తే ఏకంగా రూ.9,000కు పైగా పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జనవరి 1న రూ.30,170 వద్ద ఉంది. ఇప్పుడు ఈ ధర రూ.37,300 వద్ద కదలాడుతోంది. అంటే ఏకంగా రూ.7,130 పెరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. జనవరి 1న ధర 10 గ్రాములకు రూ.31,650 వద్ద ఉంది. ఇప్పుడు ధర ఏకంగా రూ.40,690 స్థాయికి పెరిగింది. అంటే రూ.9,040 ర్యాలీ చేసింది

Related Posts