YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బాబుకు బీపీ తెప్పిస్తున్న ఎమ్మెల్యేలు

 బాబుకు బీపీ తెప్పిస్తున్న ఎమ్మెల్యేలు

 బాబుకు బీపీ తెప్పిస్తున్న ఎమ్మెల్యేలు
విజయవాడ, డిసెంబర్ 31
చంద్రబాబు మీద సొంత పార్టీలోనే కాదు, బయట కూడా ఒక విమర్శ ఉంది. ఆయన మాటలకే పరిమితం అవుతారు తప్ప చేతలకు పోరని, బహుశా ఇదే తమ్ముళ్లకు బాగా అనుకూలం అవుతోందిట. పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, కేవలం 23 సీట్లకు పరిమితం కావడంతో ఇపుడు గెలిచిన ప్రతి ఎమ్మెల్యే అధినాయకత్వాన్ని శాసించేందుకు రెడీ అవుతున్నారు. వారిలో ముదురు నేతలు అయితే ఇక చంద్రబాబుకు హై బీపీయే తెప్పించేస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్ విశాఖలో క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదీ నా మద్దతు అంటూ బయటకు వచ్చేశారు. జగన్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశంసించడం విశేషం. అంతే కాదు దగ్గరుండి మరీ మిగిలిన పార్టీ నాయకులతో కూడా విశాఖ రాజధానికి అనుకూలంగా ఒక తీర్మానం చేయించేశారు.ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు చంద్రబాబు గంటా వైఖరి పట్ల బాగా సీరియస్ గా ఉన్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. గంటా గత ఏడు నెలలుగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా తనకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అసెంబ్లీకి రావడం మానుకున్నారు. చంద్రబాబు ఆదేశించినా పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనలేదు. ఇపుడు ఏకంగా రాజధాని విషయంలో పార్టీ లైన్ దాటేశారు. దాంతో గంటాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.గంటా బిగ్ షాట్. ఆయన ఉత్తరాంధ్రాలో పార్టీ కోసం ఆర్ధికంగా నిలబడిన నేత. ఆయన ఓడిపోయాక కాస్తా దూరంగా ఉంటున్నారు తప్ప టీడీపీకి బాగా కావాల్సిన నేత. అటువంటి నాయకునికి షోకాజ్ నోటీస్ ఇస్తే దారికి వస్తారా అన్నది పెద్ద డౌట్. పైగా గంటా ఫ్రీ బర్డ్ అయిపోతారు. ఆయన వల్లభనేని వంశీ బాటలోనే అసెంబ్లీలో ప్రత్యేకమైన సీట్లో కూర్చుంటే అపుడు టీడీపీకి మరో వికెట్ డౌన్ అవడం తప్ప వేరే ప్రయోజనం సమకూరదు. అయితే షోకాజు నోటీస్ కంటే ముందు గంటాను పిలిచి ఒకసారి మాట్లాడాలని కూడా చంద్రబాబు అనుకుంటున్నారుట. మరి దాని వల్ల కూడా పెద్దగా ఫలితం ఉండదని ముందే తమ్ముళ్ళు అంటున్నారంటే గంటా రూట్ ఎటో టీడీపీకి అర్ధమైపోయిందనే చెప్పాలి.ఇక గంటా అనుచరుడుగా ఉన్న ఎస్ ఎ రహమాన్ ఆధ్వర్యంలో విశాఖే టీడీపీ రాజధాని అంటూ తీర్మానం చేయించారు. దానికి బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ తో పాటు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు. మరి అనేక మంది నేతలు కూడా హాజరయ్యారు. వారి విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే షోకాజ్ నోటీస్ ఇవ్వగలరా అంటూ అపుడే గంటా అనుచరులు ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా గంటా వంటి వారి విషయంలో చంద్రబాబు ఎన్నాళ్ళు ఓపిక పడితే అన్నాళ్ళు ఆయన టీడీపీలో టెక్నికల్ గా ఉంటారని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఏదైనా యాక్షన్ తీసుకుంటే నాడే ఆయన పార్టీకి దూరం అవుతారని కూడా విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి చంద్రబాబు అంత రిస్క్ తీసుకుంటారో లేదో.

Related Posts