YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

చిన్న తిరుపతిలో అక్రమ మైనింగ్ యవ్వారం

చిన్న తిరుపతిలో అక్రమ మైనింగ్ యవ్వారం

చిన్న తిరుపతిలో అక్రమ మైనింగ్ యవ్వారం
ఏలూరు  డిసెంబర్ 31
పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మైనింగ్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయనాయకుల అండదండలు, అధికారుల అలసత్వంతో మైనింగ్ కాంట్రాక్టర్లు పరిమితికి మించి సుద్ద గనులను యదేచ్ఛగా త్రవ్వేస్తున్నారు.  దీంతో ద్వారకాతిరుమల చుట్టు ఉన్న కొండలను త్రవ్వడం వల్ల సమీపంలో ద్వారకా తిరుమల కొండపై కొలువుతీరిన వెంకటేశ్వర స్వామి గుడికి కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లుతుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. నిత్యం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఈ చిన్న తిరుపతి ఆలయానికి వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యమున్న ఈ ద్వారక తిరుమల గ్రామం లో  సుద్ధ గనులు తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలో ముఖ్యంగా చిన్నతిరుపతి కొండచుట్టూ ఉన్న 19 శుద్ధ గనుల ఉన్నాయి. వీటిని దక్కించుకున్న కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వం ఆదేశం ప్రకారం సుద్దగనులను బెంచ్ ఫార్మెట్ లో త్రవ్వకాలు జరపాలి. తరువాత త్రవ్వకాలు జరిపిన గనులను పూడ్చి వేసి చెట్లు నాటాలి, కానీ కాంట్రాక్టర్ లు ఇదేమి పట్టించుకోకుండా కొండచుట్టూ ఉన్న సుద్ద గనులలో త్రవ్వకాలు  జరిపి ఆ తర్వాత వాటిని అలాగే వదిలేసి వెళుతున్నారు. ద్వారకాతిరుమల కొండ చుట్టూ ఈ సుద్దగనులు ఉండటంతో కాంట్రాక్టర్లు త్రవ్వకాలు జరుపుకుంటూ యదేచ్చగా కొండను దొలుచుకుంటూ ముందుకు వస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉండటంతో పాటు, కాసులకు కక్కుర్తిపడే అధికారులు మద్దతు ఇవ్వడంతో వీరికి అడ్డుఅదుపూ లేకుండా పోతోంది . ఇప్పటికే సుద్దగనుల ప్రక్కన ఉన్న వెంకటకృష్ణాపురంలో గ్రామంలోని ప్రజలు మైనింగ్ పొల్యూషన్ వల్ల అనేక రోగాలు బారిన పడుతున్నారు. కొండలను దొలచడం తోపాటు బాంబ్ బ్లాస్ట్ ల వల్ల చాలా ఇళ్లకు పగుళ్లు రావటం వల్ల కొంత మంది ప్రజలు తమ నివాసాలు వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు.అధికారులు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని తమ దర్శించాలని స్థానికులు వేడుకుంటున్నారు. గ్రేడ్ వన్ సుద్ద ఈ గనుల తవ్వకాల్లో దొరుకుతున్నప్పటికి గ్రేడ్ 3 సుద్దకు మాత్రమే కాంట్రాక్టర్ లు ప్రభుత్వానికి డబ్బులు చెల్సిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి గనులలో జరుగుతున్న అక్రమాల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related Posts