వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష
భద్రాచలం డిసెంబర్ 31
వైకుంఠ ఏకాదశి మహోత్సవం సందర్భంగా భద్రాచలం సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా,జిల్లా కలెక్టర్, రజత్ కుమార్ శైని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికార యంత్రాంగం తో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తారికున రాముల వారు హంస వాహనంలో తెప్పోత్సవం, 6వ తారికు తెల్లవారు జామున ఉత్తర ద్వారా దర్శనం జరుగును. ఈ కార్యక్రమాని పెద్ద ఎత్తున భక్తులు వస్తారని వారికీ ఎటువంట్టి ఇబ్బదులు గురికావద్దుఅని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. త్రాగు నీరు, మెడికల్ క్యాంపు లు, కరెంట్, గజ ఈతగాళ్ళు, అందుబాటులో ఉండాలని సంబంధించిన అధికారులకు సూచిచారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనీ, పారిశుధ్యం పనులు చేసేవాళ్ళు ఎప్పటికపుడు శుభ్రం చేయాలనీ, స్థానికంగా వున్నా హోటళ్లు నాణ్యత తనిఖీ చేయాలనీ సంబంధించిన అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర, ఓఎస్డి రమణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.