పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి డిసెంబర్ 31
పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండవ విడత పల్లె ప్రగతి అంశం పై జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలో జనవరి 2,2020 నుంచి జనవరి 12,2020 వరకు రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుందని, పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు జిల్లాలోని ప్రతి గ్రామానికి ఒక మండల అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని, గ్రామంలో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాలను సదరు అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 2,2020న నిర్వహించే గ్రామసభతో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతుందని, మన జిల్లాలోని గ్రామాలో నిర్వహించే గ్రామసభలో మొదటి విడత నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రుపొందించిన ప్రణాళికలు, తీసుకున్న పారిశుద్ద్య చర్యలు, గ్రామ పంచాయతికి సంబంధించిన ఆర్థిక స్థితి , 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు, వాటి వినియోగం పై ప్రజలకు వివరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్నీ గ్రామ పంచాయతిలలో స్మశానవాటిక, డంపింగ్ యార్డు, నర్సరీల ఎర్పాటు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మండలాల వారిగా వాటి పురొగతిని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతిలో డంపింగ్ యార్డు ఎర్పాటు చేసామని, స్మశానవాటిక నిర్మాణం వేగవంతం చేయాలని, స్మశానవాటిక నిర్మాణానికి అవసరమైన ఇస్సుకను ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో నిర్మించిన డంపింగ్ యార్డులకు కంపొస్ట్ షెడ్ ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసి పనులు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.రొంపకేశారం గ్రామంలో ఎర్పాటు చేసిన వానర వనంలో గ్రామ సర్పంచ్ ఫెన్సింగ్ ఎర్పాటు చేసారని, అదే విధంగా మన జిల్లాలో వానర వనాలకు పూర్తి స్థాయి ఫెన్సింగ్ ఎర్పాటు చేయాలని, ప్రతి వానరవనానికి తప్పనిసరిగా బోర్డు ఎర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలోని గ్రామపంచాయతిలలో సర్వే నిర్వహించి అవసరమైన మేరు నూతనంగా ఇంకుడుగుంతల మంజూరు చేసి నిర్మించాలని, జిల్లా వ్యాప్తంగా గ్రామాలో నిర్మీంచిన ఇంకుడుగుంతల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలో అవసరమైన మేర అదనంగా సామూహిక ఇంకుడుగుంతలను నిర్మీంచాలని, గ్రామాలో దారిద్ర్య రేఖకు ఎగువున ఉన్న కుటుంబాలు సైతం ఇంకుడగుంతలు నిర్మించుకునేలా వారికి నోటిస్ జారీ చేసి గడువులోపు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్డి సుందరీకరించాలని, వాటిని పరిశుభ్రంగా నిర్వహించాలని, సామూహిక మరుగుదొడ్డి స్థితిగతులను ప్రత్యేకాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ద్యం నిర్వహణ సంబంధించి ప్రజలను భాగస్వామ్యం చేస్తు నిర్వహిస్తున్న స్వచ్చ శుక్రవారం కార్యక్రమంలో ప్రతి అధికారి తప్పనిసరిగ్గా పాల్గోనాలని కలెక్టర్ ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, రాజకీయాలకతీతంగా ప్రతి ప్రజాప్రతినిథిని సమన్వయం చేసుకుంటూ ఫలితాలు రాబట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తు ప్రతి గ్రామ పంచాయతి పంచసుత్రాల అమలుకు సంబంధించి కార్యచరణ సిద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి మనం 6 మొక్కలు పంపిణీ చేసామని,పల్లె ప్రగతి కార్యక్రమ సందర్బంగా ప్రతి ఇంటిలో వాటి స్థితిగతిని పరిశీలించి, మొక్కల పెంపకం పై నివేదిక అందజేయాలని, గ్రామాలో నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలో ప్రజలు సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో, మార్కెట్లలో సాముహిక కంపొస్ట్ పిట్లను ఎర్పాటు చేయాలని, గ్రామంలో పశుసంపద ఉన్న వారిని గుర్తించి అవసరాల మేర కంపొస్ట్ పిట్ నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలని, అలసత్వం వహించే వారి పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తు చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేసారు.
స్పృహ కార్యక్రమం నిర్వహణకు కమిటిల స్థాపన
గ్రామాలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు సమాంతరంగా స్పృహ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతిలో ఉన్న యువకులు, పెన్షన్ దారులతో కమిటీలు ఎర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పురుషులలో అవగాహన కల్పించాలని, మహిళ సంరక్షణ చట్టాలు, మహిళల పై నేరాలకు పాల్పడితే విధించే శిక్షల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పృహ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో మధ్యలో విద్య నిలిపివేసిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నామని, అదే సమయంలో విద్యనభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారిని గుర్తిస్తున్నామని, వారు స్వయం ఉపాధి కింద ఉపాధి కల్పించడమే లక్ష్యంతో బ్యాంకర్లతో సమన్వయంతో గ్రామాలో సమావేశాలు నిర్వహించి రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే సమయంలో స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మహిళల పై జరుగుతున్న దాడుల నివారణే లక్ష్యంగా మాట్లాడకుందాం మార్పు తీసుకొని వద్దాం అనే నినాదంతో మనవంతు కృషి మనం చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, జిల్లా ఇంచార్జి గ్రామీణాభివృద్ది అధికారి చంద్రప్రకాశ్ రెడ్డి, జిల్లా పంచాయతి అధికారి వి.సదుర్శన్ , జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఎంపిడిఒలు, ఎంపిపిలు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు