YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఆ మాట అప్పుడే చెప్పాల్సింది: పవన్

జగన్ ఆ మాట అప్పుడే చెప్పాల్సింది: పవన్

జగన్ ఆ మాట అప్పుడే చెప్పాల్సింది: పవన్
గుంటూరు డిసెంబర్ 31 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటిస్తున్నారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆయన కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని పవన్ తెలిపారు. రాయలసీమలో టమోటో రైతులకు ఎలా అయితే అండగా నిల్చామో.. రాజధాని ప్రాంత రైతులకు కూడా అంతే అండగా ఉంటామన్నారు. రైతుల్ని పోలీసులు ఇబ్బందులు పెట్టొచ్చు.. కేసులు పెడతామని బెదిరించొచ్చు.. కానీ రైతులు ఎవరికీ భయపడొద్దని భరోసా కల్పించారు. రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవలని పవన్ చెప్పారు. రాజధానికి కట్టుబడి ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చిందని, రాజ్యాంగానికి కట్టుబడే ప్రతి ఒక్కరూ పని చేయాలని పవన్ సూచించారు. రాజధానిని మార్చాలంటే ఏకాభిప్రాయం కావాలన్నారు. రాజధాని మారుస్తామని జగన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పినట్లైనా అందరం ఒప్పుకునేవారమని, ఇప్పుడు స్థిరమైన రాజధాని ఉండేదని పవన్ వ్యాఖ్యానించారు. అధికారం ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఏముంది?. దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రాజధాని రైతులకు నేను అండగా ఉంటా. బెదిరింపులకు రైతులు భయపడాల్సిన అవసరం లేదు.. మీరు భూములిచ్చింది ప్రభుత్వానికి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చిన రైతుల్ని బెదిరిస్తున్నారు. రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేయడం సరికాదు. మీ బిడ్డల భవిష్యత్ కోసం భూములు ఇస్తే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడారని అయన విమర్శించారు

Related Posts