YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా కార్యక్రమాలు ఆర్టీసీ విలీనంతో కొత్త సంవత్సరం ప్రారంభం 

2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా కార్యక్రమాలు ఆర్టీసీ విలీనంతో కొత్త సంవత్సరం ప్రారంభం 

2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా కార్యక్రమాలు ఆర్టీసీ విలీనంతో కొత్త సంవత్సరం ప్రారంభం 
అమరావతి డిసెంబర్‌ 31   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 2న రైతు భరోసా చివరి విడత డబ్బు పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అలాగే జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమంకు త్వరగా అర్హులను గుర్తించాలని అన్నారు. జనవరి 3 నుంచి ఆరోగ్య శ్రీకార్డుల పంపిణీ ప్రారంభం అవుతోంది. అదే రోజు ఆరోగ్యశ్రీ కింద 2059 రోగాలకు చికిత్స, ప.గో.లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం వుంటుంది. మిగిలిన జిల్లాల్లో 1259 రోగాలకు పైలట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందఉతుంది. 5వేల హెల్త్ సబ్ సెంటర్లకు జనవరిలోగా టెండర్లు ఖరారు అయ్యాయి. రైతు భరోసా తుది విడత లబ్ధిదారుల జాబితా జనవరి 2న విడుదల అవుతోంది. జనవరి 4,6,7,8 తేదీల్లో పాఠశాలల్లో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులపై చైతన్య పరిచే కార్యక్రమాలు జరపాలని అయన అన్నారు.ఇక స్పందన విషయంలో అందరూ బాగా ప నిచేస్తున్నారు, అభినందనలు. స్పందనలో వస్తున్న విజ్ఞాపన పత్రాలు పరిష్కారంలో నాణ్యతకోసం ఇప్పటికే విధి విధానాలను ఏర్పాటు చేసుకున్నాం. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధి దారుల ఎంపిక, సోషల్ ఆడిట్, అర్హుల జాబితాలో ఒక వేళ పేరులేకపోతే ఎలా నమోదుచేసుకోవాలన్నదానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారుచేశామని అన్నారు. ఈ ప్రొసీజర్ అన్ని గ్రామ సచివాలయాలకు, విభాగాలకు పంపిస్తామని అన్నారు. 
వైయస్సార్ నవశకం వైయస్సార్ నవశకం కింద ఇళ్లపట్టాలు, పెన్షన్లు, రేషన్కార్డులకు సంబంధించి దాదాపు 60 శాతం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్తరేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ,చేస్తాం. మనకు ఓటు వేయనివారుకూడా అర్హులైతే పథకాన్ని వర్తింపు చేయాలని అన్నారు. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు సహా పథకాలకు సంబంధించి అర్హతలను, జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలని సీఎం అన్నారు. 

Related Posts