YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 దమ్ముంటే మీరే ప్రజా తీర్పు కోరండి టీడీపీకి అనంతపురం ఎమ్మెల్యే అనంత సవాల్ కర్నూలులో హైకోర్టు, విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని రాజీనామా చేసి పోటీ చేయండి*

 దమ్ముంటే మీరే ప్రజా తీర్పు కోరండి టీడీపీకి అనంతపురం ఎమ్మెల్యే అనంత సవాల్ కర్నూలులో హైకోర్టు, విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని రాజీనామా చేసి పోటీ చేయండి*

 దమ్ముంటే మీరే ప్రజా తీర్పు కోరండి టీడీపీకి అనంతపురం ఎమ్మెల్యే అనంత సవాల్ కర్నూలులో హైకోర్టు, విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని రాజీనామా చేసి పోటీ చేయండి*
అనంతపురం, డిసెంబర్‌ 31   
పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. రాజధాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం మంచిది కాదన్నారు. దమ్ముంటే 
కర్నూలులో హైకోర్టు, విశాఖలో పరిపాలనా రాజధాని వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని సవాల్‌ విసిరారు. మంగళవారం తన స్వగృహంలో 26 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెజార్టీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాలతోనే ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారని, రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా ఐదేళ్లు ఉన్నా అభివృద్ధి మాత్రం చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, బాబు పాలనలో రైతుల ఆత్మహత్యలు, వలసలు అధికంగా జరిగాయన్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఏడు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన చేస్తుంటే చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజధానిగా అమరావతి ప్రకటన తర్వాత చంద్రబాబు వేసిన అంచనా ప్రకారమే అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందన్నారని, ఇప్పుడది మరింత పెరిగిందన్నారు. అంత మొత్తాన్ని ఒకే ప్రాంతంలో ఖర్చు చేస్తే ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీ తరఫున గెలిచిన 151 మంది మళ్లీ తీర్పుకోరాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధైర్యముంటే టీడీపీ నుంచి గెలిచిన వాళ్లంతా రాజీనామా చేస్తే తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని, అప్పుడు రాజధాని అమరావతిలోనే ఉండాలా? అన్న విషయంలో ప్రజలే తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇక్కడి ప్రజలు, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.

Related Posts