YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శృంగేరీ మఠంలో  రాహుల్ గాంధీ

శృంగేరీ మఠంలో  రాహుల్ గాంధీ

 శృంగేరీలో రాహుల్ గాంధీ, మరియూ సిద్ధరామయ్యలు జగద్గురువులను కలుసుకున్నప్పుడు  ఆ ఇరవై నిమిషాలలో జరిగిందంటే.. !?  
కన్నడ మాసపత్రిక " హిందుత్వ -బంధుత్వ "  సంపాదకులు శ్రీ బి జగదీశ్ చంద్ర గారు, మఠములోని సిబ్బంది మరియు ఇతర పరివారము వారిని  విచారించి తెలుసుకొని రాసిన ఈ చిన్ని వ్యాసము చదవండి.. జగద్గురువుల మీద మనందరి భక్తి ఇబ్బడిముబ్బడియై సంతోషము కలుగక మానదు. 


శృంగేరీ లో సామన్య దర్శనానంతరము , ఆ ఇద్దరినీ తమ ’ నరసింహ వనము ’ లోని మందిరమునకు జగద్గురువులు పిలిపించుకున్నారు. అదీ ఊరికే కాదు. వారి చేత స్నానము చేయించి, మడి బట్టలు కట్టించి, పైన కాషాయపు ఉత్తరీయములు ధరింపజేసి పిలుచుకున్నారు. 

ఆ సంపాదకులు ఈ విధముగా రాశారు..
"  శృంగేరీ నాకు కొత్తదేమీ కాదు. అక్కడి జేసీబీఎమ్ కాలేజీ విద్యార్థినైన నాకు శృంగేరితో ఒక అవినాభావ సంబంధముంది. నాతో చదివిన అనేకులు సహపాఠులు శృంగేరీ మఠములోనూ, ఇంకా చుట్టుపక్కలా ఉద్యోగాలు చేస్తూ  ఇంకా నాకు సమీప సంపర్కములో  ఉన్నారు. అటువైపునుండీ వారిని విచారించినపుడు బయట పడిన సంగతి హిందువులందరూ గౌరవించవలసినది.

శ్రీమఠాన్ని సందర్శించి జగద్గురువుల దర్శనానుగ్రహములను పొందగోరువారు మడిబట్టలను కట్టుకొని వెళ్ళుట సహజము మరియూ సాంప్రదాయము. అయితే సదా సనాతన ధర్మ విరోధులైన సిద్ధరామయ్య మరియూ రాహుల్ గాంధీలు మడివస్త్రాలను ధరించి వచ్చినా, ఆ వస్త్రాలపైన విశేషముగా మరొక కేసరి వర్ణపు ఉత్తరీయాన్ని తప్పనిసరిగా ధరించాలని ఆదేశము ఇచ్చినది నిజంగా శ్లాఘనీయము. అటుతర్వాత జగద్గురువుల దర్శనానికి వెళ్ళినపుడు జగద్గురువులు, దర్శనము తర్వాత వారిని ప్రత్యేక మందిరానికి పిలిచి, వారిని ఒకటే ప్రశ్న అడిగారు ," సనాతన ధర్మము గురించి మీకెందుకు ఈ నిర్లక్ష్యము, అగౌరవము ? మీకు సనాతన ధర్మము మీద అసహనము ఉంటే , దానిని వదలి దూరముగా ఉండండి. అంతేగానీ సనాతన ధర్మమును పాటించే జాతులమధ్య వైషమ్యాలను, వైరుధ్యాలను తెచ్చే పనులు చేయవద్దు. మఠాలు, మందిరాలను నిర్లక్ష్యము చేయకండి. కించపరచకండి.  ఏవైనా మఠాలు కానీ, మందిరాలు కానీ ఏదైనా తప్పు చేసినాయా ? మఠాలనుండీ,మందిరాలనుండీ సంగ్రహించిన దేవాదాయశాఖ ద్వారా వచ్చిన ధనాన్ని ఆయా మఠాలకు గానీ ఆలయాలకు గానీ ఉపయోగించుట మాని, అన్యధర్మాల కార్యాలకు వినియోగించుట తప్పు. మీరు మమ్మల్ని గౌరవించో, మరొక కారణముచేతనో ఇక్కడికి వచ్చినారు, సంతోషమే, కానీ మీరు ధర్మవిరోధములైన కార్యాలను చేస్తున్నందువలన మా ఆశీర్వాదము మీకు ఎప్పటికీ ఉండదు. " అని సూటిగా చెప్పినారు. 
దీనితో విచలితులైన సిద్ధు మరియూ రాహుల్, బయటికి వచ్చాక, ప్రసార మాధ్యమాలకు ఈ విషయము తెలియకుండా జాగ్రత్త పడినారు. అయితే వారు వెళ్ళిపోయిన తరువాత , మఠములోని సిబ్బంది వర్గము వారు జగద్గురువుల వాక్కులను విని సంతోషించి, వారి వారి ఆప్తులతో ఈ విషయము పంచుకున్నట్టు, మరియూ కాంగ్రెస్ వారికి జగద్గురువులు ముఖభంగము చేసిన విషయము ఆనోటా ఈనోటా ప్రచారమవుతున్నది. రాజకీయాలతో పనిలేకుండా , దారి తప్పిన మూర్ఖులకు  బుద్ధి వచ్చేలా చేసిన జగద్గురువులు శృంగేరీ భక్తులకు , కోట్లాది హిందువులకూ గర్వకారణము అని చెప్పవచ్చును. 

-- జగదీశ్చంద్ర ,బి,సంపాదకులు- హిందుత్వ-బంధుత్వ  మాసపత్రిక

Related Posts