YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మాయవతితో ముచ్చటేనా

మాయవతితో ముచ్చటేనా

మాయవతితో ముచ్చటేనా
విజయవాడ, జనవరి 1
పొత్తు పెట్టుకుంటేనే సరిపోదు. కాళ్లకు మొక్కగానే సరికాదు. వారి ఆలోచనలను కూడా అమలు పర్చాలి. వారి నిర్ణయాలను కూడా అమలు చేయాలి. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పలుసార్లు భేటీ అయ్యారు. మాయావతి రాష్ట్ర పర్యటనలో ఆమె కాళ్లకు నమస్కరించి మాయావతి తనకు ఆదర్శప్రాయమని పవన్ కల్యాణ్ తెలిపారు.అయితే మాయావతికి ఉన్న ధైర్యం పవన్ కల్యాణ్ కు లేదన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే సరిపోదని, మాయావతి ధైర్యాన్ని ప్రదర్శిస్తేనే పార్టీ మనుగడ ఉంటుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. పార్టీ లైన్ థిక్కరిస్తే మాయావతి అస్సలు ఊరుకోరు. తాను అనుకున్నది చేస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం మాయావతికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.బీఎస్పీ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహించారంటూ ఒక ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తూ బీఎస్పీ ఎమ్మెల్యే రమాభాయ్ చేసిన వ్యాఖ్యలపై మాయావతి మండిపడ్డారు. వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మాయావతి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ద్వారా హెచ్చరించారు.కాని పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ కల్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీఎస్పీకి పెద్దగా బలం లేకపోయినా, తగినంత మంది ఎమ్మెల్యేలు లేకున్నా పార్టీ క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేను మాయావతి సస్పెండ్ చేశారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కట్టడి చేయలేకపోతున్నారన్న కామెంట్స్ జోరుగా వినపడుతున్నాయి. మాయావతికి ఉన్న ధైర్యం పవన్ కు లేదంటూ నెటిజెన్లు పెద్దయెత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts