మాలావత్ పూర్ణ మరో రికార్డు
హైద్రాబాద్, జనవరం 1
నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పాకల గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ మరో రికార్డు సృష్టించింది. ఈనెల 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని ఆమె అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో విన్సన్ మాసిఫ్ ఒకటి. దీనిఎత్తు 16,050 అడుగులు. ఏడు ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది పూర్ణ లక్ష్యం. 2014లో 13 ఏండ్ల్లలోనే ప్రపంచంలోని అత్యతం ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది.2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2017లో యూరప్‌లోని ఎల్‌బ్రస్, ఒసియానియా రీజియన్‌లోని కార్ట్ స్నేజ్ పర్వతాలను అధిరోహించింది. తన లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోని మరో ఎత్తయిన పర్వతం ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతాన్ని అధిరోహిస్తానని పూర్ణ తెలిపింది.మారుమూల ప్రాంతంలో జన్మించిన పూర్ణ.. దేశం గర్వించే స్థాయిలో నిలిచి, పాకాల గ్రామాన్ని ప్రపంచంలో నిలిపిందని గ్రామస్తులు ఆనందం వ్వక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే తాను ఇన్ని పర్వతాలు అధిరోహించానని మాలావత్ పూర్ణ తెలిపారు.పాకాల గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో దేవిదాస్,లక్ష్మి దంపతులకు జన్మించిన పూర్ణ.. ప్రాథమిక విద్యాభ్యాసం అంత సాంఘిక సంక్షేమ పాఠశాలలో పూర్తి చేసింది. అక్కడే ఆమెకు పర్వతారోహణ శిక్షణ మొదలైంది. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహంతో భువనగిరిలో మొదలైన శిక్షణ.. లడ క్, డార్జిలింగ్, మైట్రినా వరకు సాగింది. 14వ ఏట ప్రపంచం లో ఎత్తైన ఎవరెస్టు శిఖరం అధిరోహించిన బాలికగా పూర్ణ రికా ర్డు సాధించింది. 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2017 లో రష్యాలోని ఎల్‌బృష్, 2018లో అర్జెంటీనాలోని అకోంకగ్వా శిఖరం అధిరోహించింది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది.ఎవరెస్టు శిఖరం ఎక్కడం జీవితంలో మైలురాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్ సర్ మద్దతుతోనే సాధ్యమైంది.