YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి దేశీయం

చారిత్రాత్మక సాకారం అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు నలుగురు ఎంపిక

చారిత్రాత్మక సాకారం  అంతరిక్షంలోకి భారత  వ్యోమగాములు  నలుగురు  ఎంపిక

చారిత్రాత్మక సాకారం  అంతరిక్షంలోకి భారత  వ్యోమగాములు  నలుగురు  ఎంపిక 

కలల సాకార దిశగా ఇస్రో.  గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని ఇస్రో చీఫ్ కే శివన్ తెలిపారు. భారత వైమానికి దళానికి చెందిన వీరికి జనవరి మూడో వారం నుంచీ శిక్షణ ప్రారంభమవుతుందని, రష్యాలో ఈ ట్రైనింగ్ ఉంటుందని ఆయన తెలిపారుబెంగళూరులో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇస్రో అధినేత ఈ విషయాన్ని వెల్లడించారు. అంతరిక్షంలోకి భారత వ్యోమగాముల్ని పంపాలనే లక్ష్యంతో ఇస్రో గగన్‌యాన్ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. 2022లో చేపట్టబోయే ఈ ప్రయోగంలో వ్యోమగాములు కనీసం ఏడు రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు. మహిళా వ్యోమగాములను కూడా ఈ ప్రయోగంలో భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నట్టు ఇస్రో గత ఏడాది ప్రకటించింది. కాగా.. గగన్‌యాన్-2కు సంబంధించి ప్రస్తుతం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చేపట్టబోయే వాటిలో వ్యోమగాముల శిక్షణ ముఖ్యమైనదని శివన్ తెలిపారు. ఈ ఏడాది ఇస్రో 25 ప్రయోగాలు చేపట్టబోతోందని కూడా ఇస్రో చీఫ్ కే  శివన్  వెల్లడించారు 

Related Posts