YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. లిఫ్ట్‌ కూలి  ఆరుగురు  మృతి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. లిఫ్ట్‌ కూలి  ఆరుగురు  మృతి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. లిఫ్ట్‌ కూలి  ఆరుగురు  మృతి
న్యూఢిల్లీ జనవరి 1
నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్‌ అగర్వాల్‌, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండోర్‌ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్‌ అగర్వాల్‌ న్యూ ఇయర్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు.నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్‌తో పాటు పలువురు లిఫ్ట్‌ ఎక్కగా, ప్రమదవశాత్తూ లిఫ్ట్(ఎలివేటర్) తీగ తెగిపోవడంతో ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దాంతో వీరంతా కాంక్రీట్‌ గుంతలో పడిపోయారు. దుర్ఘటనలో పునీత్‌ అగర్వాల్‌ (53), ఆయన కుమార్తె పాలక్‌ (27), అల్లుడు పాల్కేశ్‌, మనవడు నవ్‌తో పాటు బంధువులు గౌరవ్‌, ఆర్యవీర్‌ ప్రాణాలు విడిచారు. ఇక ఈ  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్‌ అగర్వాల్‌ భార్య నిధి అగర్వాల్‌ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Related Posts